By: ABP Desam | Updated at : 01 Apr 2023 10:19 PM (IST)
మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు (Image: LSG Twitter)
Lucknow Super Giants vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (73: 38 బంతుల్లో, రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ విజయానికి 120 బంతుల్లో 194 పరుగులు కావాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ చాలా నిదానంగా ఆరంభం అయింది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ (8: 12 బంతుల్లో, ఒక సిక్సర్) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత కైల్ మేయర్స్ (73: 38 బంతుల్లో, రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు) చెలరేగి పోయాడు. సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో లక్నో స్కోరు పరుగులు పెట్టింది. అయితే మరో ఎండ్‌లో దీపక్ హుడా (19: 18 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు. 11వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్ హుడా అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ కూడా అవుటయ్యాడు.
దీంతో స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కానీ నికోలస్ పూరన్ (36: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), చివర్లో ఆయుష్ బదోని (18: 7 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
Innings Break!@LucknowIPL post a mammoth total of 193/6 on board!
— IndianPremierLeague (@IPL) April 1, 2023
Are we in for a high-scoring thriller in Lucknow❓ Stay tuned!
Scorecard ▶️ https://t.co/086EqX92dA #TATAIPL#TATAIPL | #LSGvDC pic.twitter.com/X2KiXNp9pQ
A blistering 73 off 38 on #TATAIPL debut makes Kyle Mayers our 🔝 performer from the first innings of the #LSGvDC contest 🙌
— IndianPremierLeague (@IPL) April 1, 2023
Take a look at his batting summary 🔽 pic.twitter.com/vIiVLnM13V
7️⃣3️⃣ runs
— IndianPremierLeague (@IPL) April 1, 2023
3️⃣8️⃣ balls
2️⃣ fours
7️⃣ sixes
Smashing a half-century on #TATAIPL debut, the Kyle Mayers way 💥
Sit back and enjoy his flurry of sixes 🎥🔽 #LSGvDChttps://t.co/3Ov1cnzeLd
Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి
WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే
Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు
Asia Cup: మాకు సాయం చేస్తారనుకుంటే వెన్నుపోటు పొడుస్తారా? - లంక బోర్డుపై పీసీబీ అసంతృప్తి
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్