Lionel Messi jersey: ప్రధాని మోదీకి అర్జెంటీనా గిఫ్ట్- మెస్సీ జెర్సీని అందించిన వైపీఎఫ్ అధ్యక్షుడు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అర్జెంటీనా నుంచి ఒక బహుమతి అందింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ఫిఫా ప్రపంచకప్ విజేత మెస్సీ ధరించిన జెర్సీని మోదీకి అందజేశారు.

Lionel Messi jersey: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అర్జెంటీనా నుంచి ఒక బహుమతి అందింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ఫిఫా ప్రపంచకప్ విజేత మెస్సీ ధరించిన జెర్సీని మోదీకి అందజేశారు. బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఈ బహుమతిని ఇచ్చారు.
గత డిసెంబర్ లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ను అర్జెంటీనా గెలుచుకుంది. ఈ ప్రపంచకప్ తో లియోనెల్ మెస్సీ తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఫైనల్ లో ఆ జట్టు ఫ్రాన్స్ ను ఓడించింది. 90 నిమిషాల మ్యాచ్ 2-2తో ముగియగా.. అదనపు సమయంలోనూ 3-3తో స్కోర్లు సమమయ్యాయి. అయితే పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ ను ఓడించి కప్ ను అందుకుంది.
అర్జెంటీనా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా ఆ దేశాన్ని అభినందించారు. "ఇది అత్యంత ఉత్కంఠభరితమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఒకటిగా గుర్తుండిపోతుంది! #FIFAWorldCup ఛాంపియన్‌లుగా మారినందుకు అర్జెంటీనాకు అభినందనలు! వారు ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడారు. అర్జెంటీనా మరియు మెస్సీకి చెందిన మిలియన్ల మంది భారతీయ అభిమానులు ఈ అద్భుతమైన విజయంతో సంతోషిస్తున్నారు! అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Pablo Gonzalez, President of YPF from Argentina, gifted a Lionel Messi football jersey to PM Modi on the sidelines of the India Energy Week in Bengaluru pic.twitter.com/45SegRxfYR
— ANI (@ANI) February 6, 2023





















