Kapil Dev On Kohli: మీకే కాదు నాకూ బాధేస్తోందన్న కపిల్‌దేవ్!
Kapil Dev On Kohli: విరాట్ కోహ్లీ రెండేళ్లుగా సెంచరీ చేయకపోవడం తననూ బాధిస్తోందని టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ (Kapil Dev) అంటున్నాడు.
Kapil Dev Pained By Virat Kohlis Century Drought Says It is bothering Me and All of Us: విరాట్ కోహ్లీ రెండేళ్లుగా సెంచరీ చేయకపోవడం తననూ బాధిస్తోందని టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ (Kapil Dev) అంటున్నాడు. సచిన్, ద్రవిడ్ స్థాయి ఆటగాడు ఇలాంటి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడం విచారకరమని వెల్లడించాడు. త్వరలోనే అతడి బ్యాటు నుంచి పరుగుల వరద పారుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
'అంత పెద్ద ఆటగాడు (విరాట్ కోహ్లీ) రెండున్నరేళ్లుగా సెంచరీ చేయకపోవడం నాక్కూడా బాధ కలిగిస్తోంది. ఎందుకంటే అతడు మనందరికీ ఒక హీరో! సాధారణంగా మనమంతా అతడిని రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్, సునిల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌తో పోలుస్తుంటాం. వారితో పోల్చేలా అతడు బ్యాటింగ్ చేసేవాడు. అందుకే రెండున్నరేళ్లుగా అతడు శతకం బాదకపోవడం కచ్చితంగా విచారం కలిగిస్తుంది' అని కపిల్ అన్నాడు.
Also Read: అర్థ సెంచరీతో మెరిసిన తెలుగు తేజం కేఎస్ భరత్ - మొదటిరోజు భారత్ స్కోరు ఎంతంటే?
Also Read: ఇది చాలా గొప్ప ప్రయాణం - 15 సంవత్సరాల జర్నీపై రోహిత్ ఎమోషనల్ నోట్!
'మేమంతా క్రికెట్ ఆడాం. దానిని అర్థం చేసుకున్నాం. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాక ఆలోచనా ప్రక్రియను మెరుగుపర్చుకున్నాం. ఇప్పుడు విరాట్ చేయాల్సింది అదే. మనం తప్పని అతడు నిరూపించాలి. ఒకవేళ పరుగులు చేయకపోతే మాత్రం ఏదో తప్పు జరుగుతోందనే అర్థం. మేం ఒకే ఒక్కటి గమనిస్తాం. కేవలం ప్రదర్శననే పట్టించుకుంటాం. ఒకవేళ అంచనాలు అందుకోకపోతే మాత్రం జనాలు చప్పుడు చేయొద్దని ఆశించొద్దు. నీ బ్యాటు, నీ ప్రదర్శనే మాట్లాడాలి' అని కపిల్ అన్నాడు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) అంటే ప్రత్యర్థులకు సింహస్వప్నం. అలాంటిది ఇప్పుడు సులభంగా ఔటైపోతున్నాడు. బలహీతనలు ప్రదర్శిస్తున్నాడు. సగటున 3-5 మ్యాచులకు సెంచరీ కొట్టే అతడు రెండున్నరేళ్లుగా ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు చేయలేదు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌లో 16 మ్యాచుల్లో 23 సగటుతో 341 పరుగులు చేశాడు. తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా సిరీసులో అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు ముందు సాగుతున్న లీసెస్టర్ షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచులో 69 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
After Joe roots magic which was seen on the pitch by balancing the bat @imVkohli trying the same 😂 pic.twitter.com/TUZpAUJSA1
— Yashwanth (@bittuyash18) June 23, 2022