అన్వేషించండి

Young Indian Players : ధర తక్కువైన ఐపీఎల్‌లో దమ్ము రేపుతున్న యంగ్‌ ఇండియన్స్‌ - ప్రతి మ్యాచ్‌కూ ఓ కొత్త హీరో వస్తున్నాడు!

Indian Players IN IPL 2024: ఇండియన్ కుర్రాళ్లందరినీ ఆయా ఫ్రాంచైజీలు జస్ట్ 20లక్షల రూపాయల బేస్ ప్రైస్ కి కొనేసుకున్నాయి. వాళ్లే ఇప్పుడు అంచనాలకు మించి రాణిస్తున్నారు.

IPL 2024: ఐపీఎల్‌లో అత్యంత కాస్ట్లీ ధర పలికిన ఇద్దరు విదేశీయుల కంటే బేస్ ప్రైస్ కి కొనుక్కున్న కుర్రాళ్లే ఎక్కువ మ్యాచ్ లు గెలిపించి శెభాష్ అనిపిస్తున్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ను ఇరవై కోట్ల 50లక్షలు పెట్టి కొనుక్కుంది హైదరాబాద్ సన్ రైజర్స్(SRH). వరల్డ్ కప్స్ గెలిపించిన కెప్టెన్ కావాలని ఏరికోరి ఇంత రేట్ పెట్టిన కమిన్స్(Pat Cummins) కెప్టెన్సీ సంగతి పక్కన పెడితే బౌలర్‌గా మాత్రం అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. మూడు మ్యాచులు ఆడి నాలుగు వికెట్లు తీశాడు. ఇక ఈ ఐపీఎల్లో అత్యధిక ధర పలికి.. ఐపీఎల్‌లో చరిత్రలోనే కాస్ట్లీ బై గా రికార్డు క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇప్పటి వరకూ ఒక్కటి కూడా చేయలేదు. మూడు మ్యాచులు ఆడి 11ఎకానమీ రేట్ తో కేవలం 2వికెట్లు మాత్రమే తీశాడు. కానీ స్టార్క్ కోసం కోల్‌కతా(KKR) ఏకంగా 24కోట్ల 75లక్షల రూపాయలు కుమ్మరించింది. 

కుమ్మేస్తున్న ఇండియన్ కుర్రాళ్లు

ఇప్పుడు మన కుర్రాళ్ల సంగతికి వద్దాం. ఈ కుర్రాళ్లందరినీ ఆయా ఫ్రాంచైజీలు జస్ట్ 20లక్షల రూపాయల బేస్ ప్రైస్ కి కొనేసుకున్నాయి.  
1. హర్షిత్ రానా(Harshit Rana ) కోల్ కతా నైట్ రైడర్స్. 23సంవత్సరాల వయస్సున్న ఈ పేస్ బౌలర్ టోర్నీలో ఇప్పటివరకూ 5వికెట్లు తీశాడు.  ప్రత్యేకించి ఈడెన్ గార్డెన్స్ లో లాస్ట్ ఓవర్ లో క్లాసెన్ వీరవిధ్వంసం చేస్తుంటే అతన్ని 7పరుగులు కొట్టనివ్వకుండా అడ్డుకుని మ్యాచ్ గెలిపించాడు కోల్ కతా కి హర్షిత్ రానా.

2. మయాంక్ యాదవ్ ( Mayank Yadav) - లక్నో సూపర్ జెయింట్స్(LSJ). ఇరవై లక్షలు పెట్టి 22ఏళ్ల మయాంక్ యాదవ్ ను కొనుకున్న లక్నోకు రెండు మ్యాచుల్లోనే 6వికెట్లు తీసి గిఫ్ట్ ఇచ్చాడు. రెండు మ్యాచుల్లోనూ అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 157కిలోమీటర్ల వేగంతో బాల్ విసిరి చరిత్ర సృష్టించాడు కూడా. ఫ్యూచర్ ఆఫ్ టీమిండియన్ పేస్ అటాక్ అంటున్నారు చూడాలి.

3. ఆంగ్ క్రిష్ రఘు వంశీ (Angkrish Raghuvanshi ) - కోల్ కతా నైట్ రైడర్స్(KKR). 18ఏళ్ల ఈ టీనేజ్ సంచలనం ఆడిన డెబ్యూ మ్యాచ్ లోనే 54పరుగులు చేసి అదరగొట్టాడు.

4. శశాంక్ సింగ్ (Shashank Singh) - ఏడేళ్ల నిరీక్షణ తర్వాత తనేంటో నిరూపించుకునే ఇన్నింగ్స్ ఆడాడు 32ఏళ్ల ఈ పంజాబ్ కింగ్స్ బ్యాటర్. 20లక్షలు పెట్టి పంజాబ్ కొనుక్కుంటే.. గుజరాత్ మీద 200 పరుగుల ఛేజింగ్ లో అసలు ఆశలు లేని మ్యాచ్ ని 29బంతుల్లో 61పరుగులు చేసి గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

5. అశుతోష్ శర్మ (Ashutosh Sharma) - ఇరవై లక్షల రూపాయలతో పంజాబ్ కొనుక్కున్న ఈ 27ఏళ్ల ఆటగాడు..నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో 31పరుగులు చేసి శశాంక్ సింగ్ కి అద్భుతమైన సపోర్ట్ ఇవ్వటంతో పంజాబ్ మ్యాచ్ గెలవటంలో కీరోల్ పోషించాడు.

ఈ కుర్రాళ్లందరూ ఒకటి రెండు మ్యాచ్ లకు గొప్పోళ్లని చెప్పటం లేదు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీయుల కంటే తమను కొనుకున్న టీమ్ లకు మ్యాచ్ లు గెలిపించటంలో ఈ భారత కుర్రాళ్లంతా కీ రోల్ పోషించారు. అది కూడా ఆయా టీమ్స్ వీళ్ల కోసం పెట్టిన ఖర్చు 20 లక్షలు మాత్రమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Unstoppable With NBK: రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
Embed widget