అన్వేషించండి

IPL 2024: రాహుల్‌ కాదు పూరన్‌, మార్పు వెనుక మర్మమేంటి?

Lucknow Super Giants Vs Punjab Kings: లక్నో సారధిగా నికోలస్‌ పూరన్‌ బాధ్యతలు స్వీకరించడంతో అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. పనిభారం దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయి

Why Kl Rahul Not Captaining Lucknow Super Giants : లక్నో సూపర్ జెయింట్స్  కెప్టెన్‌ కేఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కె.ఎల్‌. రాహుల్‌కు బదులుగా లక్నో కెప్టెన్‌గా నికోలస్ పూరన్ టాస్‌కు వచ్చాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రాహుల్.. పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. కెప్టెన్‌గా లేకున్నా.. కేఎల్ రాహుల్ తుది జట్టులో ఉంటాడని.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడని పూరన్ చెప్పాడు. 

ఈ సీజన్‌లో పంజాబ్‌తో మ్యాచ్ కాకుండా లక్నో జట్టు  ఆడిన ఒకే ఒక మ్యాచు లోను రాజస్థాన్‌ చేతిలో ఓడిపోయింది.  దీంతో  ఒక్క మ్యాచుకే రాహుల్‌కు అంత విశ్రాంతి  అవసరమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాయం కారణంగా గత సీజన్ రెండో అర్ధభాగానికి రాహుల్ పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇచ్చి.. వన్డే ప్రపంచకప్ 2023 సైతం ఆడాడు. తరువాత మరోసారి  గాయంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో చివరి నాలుగు మ్యాచులకు దూరమైన రాహుల్ ఇంకా కోలుకోలేదని.. అందుకే అతడిని తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో KL రాహుల్  బ్యాటింగ్‌ తో పాటూ వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించాడు. ఏకంగా రాహుల్‌ 20 ఓవర్లపాటు కీపింగ్‌ చేసి బ్యాటింగ్‌ కూడా చేశాడు. అయితే టీ 20 ప్రపంచ కప్‌లో భారత జట్టు కీపర్‌గా ఎంపికవ్వాలని రాహుల్‌ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. లక్నో జట్టులో  క్వింటన్‌ డి కాక్... పూరన్‌ ఇద్దరు మంచి కీపర్‌లు ఉన్నారు. అయినా రాహుల్‌ కీపింగ్‌ చేస్తుండడం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.  

ఐపీఎల్‌-17లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. ఓపెనర్‌ క్వింటాన్‌ డికాక్‌ 54, నికోలస్‌ పూరన్‌ 42, కృనాల్‌ పాండ్య 43 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్ 3, అర్ష్‌దీప్‌ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్... ఒక్కో వికెట్ పడగొట్టారు. అనతంరం భారీ లక్ష్య ఛేధనలో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. పంజాబ్‌ బ్యాటర్లలో శిఖర్‌ ధావన్‌ 70, బెయిర్‌ స్టో 42 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో పంజాబ్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.  ఈ మ్యాచ్ కి రాహుల్ విశ్రాంతి తీసుకున్నాడు. 

సీజన్ మొత్తాన్ని పూరన్‌ పూరిస్తాడా .. 

రాహుల్ స్థానంలో లక్నో జట్టు పగ్గాలను నికోలస్ పూరన్ అందుకున్నాడు. అయితే ఇది లక్నో ఫ్రాంచైజీ తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయమా  లేదా ఈ సీజన్ మొత్తానికి తీసుకున్న నిర్ణయమా అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పనిభారాన్ని తగ్గించుకోవాలని రాహుల్ చూస్తున్నాడా? లేదా పూర్తి ఫిట్‌నెస్ సాధించముందే ఐపీఎల్ ఆడుతున్నాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Shami Injury Handling: షమీని సరిగా వాడుకోలేదు.. బీజీటీలో తను ఉంటే లెక్క వేరే ఉండేది.. బీసీసీఐపై మాజీ కోచ్ ఫైర్
షమీని సరిగా వాడుకోలేదు.. బీజీటీలో తను ఉంటే లెక్క వేరే ఉండేది.. బీసీసీఐపై మాజీ కోచ్ ఫైర్
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Embed widget