అన్వేషించండి

Virat Kohli News: బౌల‌ర్ కోసం కోహ్లీని వద్దనుకున్న ఢిల్లీ - సెహ్వాగ్ రివీల్ చేసిన షాకింగ్ నిజాలు!

2008 తొలి ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు విరాట్ కోహ్లీని కాదని ప్రదీప్ సాంగ్వాన్‌ను ఎందుకు ఎంచుకుందో సెహ్వాగ్ వివరించాడు. దానికి ప్రధాన కారణాన్ని కూడా చెప్పాడు.

Virender Sehwag Comments: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు అతను వెన్నెముక. అయితే, 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) కోహ్లీని కాదని ప్రదీప్ సాంగ్వాన్‌ను ఎంచుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించాడు. జట్టులో బ్యాటర్లు ఎక్కువగా ఉండటం వల్లే కోహ్లీని తీసుకోలేకపోయామని సెహ్వాగ్ స్పష్టం చేశారు.

టాప్ ఆర్డర్ బ్యాటర్ల రద్దీ..
సెహ్వాగ్ మాటల ప్రకారం.. 2008లో ఢిల్లీ జట్టులో ఓపెనర్లుగా తాను, గౌతమ్ గంభీర్ ఉండేవాళ్ల‌మ‌ని, త‌మ టీమ్‌లోనే శిఖర్ ధావన్, తిలకరత్న దిల్షాన్ కూడా ఉన్నారని గుర్తు చేశాడు. వారు కూడా ఓపెనర్లే అయినప్పటికీ, తాను గంభీర్ ఓపెనింగ్ చేయడం వల్ల వారిని మూడు, ఐదు స్థానాల్లో ఆడించాల్సి వచ్చేదని తెలిపాడు. నాలుగో స్థానంలో మనోజ్ తివారీ ఉండేవాడని, ఇలా టీమ్ మొత్తం టాప్ ఆర్డర్ బ్యాటర్లతో నిండిపోయిందని పేర్కొన్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కూడా టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేసేవాడని, అతన్ని ఎక్కడ ఆడించాలో త‌మకు అర్థం కాలేదని సెహ్వాగ్ వివరించాడు.

అందుకే సాంగ్వాన్ ఎంపిక..
జట్టులో బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నా, బౌలింగ్ లో లోటు ఆ స‌మ‌యంలో కనిపించిందని సెహ్వాగ్ అన్నాడు. విరాట్ కోహ్లీని టీమ్‌లోకి తెచ్చేంత ఖాళీ త‌మ బ్యాటింగ్ లైన్ అప్‌లో లేదని, త‌మకు అప్పుడు ఒక మంచి బౌలర్ అవసరం పడిందని తెలిపాడు. అందుకే కోహ్లీని వదిలేసి ఎడమచేతి వాటం పేసర్ ప్రదీప్ సాంగ్వాన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నామ‌ని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆ వేలంలో ఆర్‌సీబీ కోహ్లీని కేవలం రూ. 12 లక్షలకే దక్కించుకుంది. ఆ తర్వాత కోహ్లీ చరిత్ర సృష్టించడం అందరికీ తెలిసిందే. ఇక వేలం సమయంలో ఢిల్లీకి సెహ్వాగే కెప్టెన్ గా ఉండి, జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరోవైపు గత 19 ఏళ్లుగా కోహ్లీ ఒకే జట్టు తరపున ఆడుతుండటం విశేషం. 

రికార్డుల రారాజు విరాట్..
ఢిల్లీ వదులుకున్న కోహ్లీ, బెంగళూరు జట్టుకు ప్రాణప్రదంగా మారాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 272 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఏకంగా 8,889 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లోనే రెండు హాఫ్ సెంచరీలతో కలిపి 228 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. ఒకవేళ ఆరోజు ఢిల్లీ కోహ్లీని తీసుకుని ఉంటే, ఆ టీమ్ చరిత్ర మరోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్ మొద‌లై 19 ఏళ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ గ‌తేడాదే ఆర్సీబీ తొలి టైటిల్ నెగ్గ‌గా, ఢిల్లీ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ర‌న్న‌ర‌ప్ తో స‌రిపెట్టుకుంది. 

టాప్ హెడ్ లైన్స్

CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
Abishek Porel Arrest: ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Embed widget