అన్వేషించండి
Advertisement
IPL 2024: విశాఖలో ఢిల్లీ మ్యాచ్‌లు - హోంగ్రౌండ్ ఎందుకు మారిందంటే ?
IPL 2024 schedule: ఢిల్లీ క్యాపిటల్స్ రెండు హోం గేమ్స్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి.
IPL makes a comeback in Vizag with two matches: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్(IPL) మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డే గేమ్స్ మధ్యాహ్నం 3:30 గంటలకు.. నైట్ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఢిల్లీ మ్యాచ్‌లు విశాఖలో...
ఈ షెడ్యూల్‌లో అన్ని జట్లు కూడా తమ హోం మ్యాచులను సొంత మైదానంలో ఆడనుండగా ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మాత్రమే విశాఖ(Visakha)లో ఆడనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచులు విశాఖలో జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఉన్నా విశాఖలో మ్యాచ్‌లు నిర్వహించడంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే మహిళల ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. ఈ లీగ్‌లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 దాకా జరిగే మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుండగా ఆ తరువాత మార్చి 5 నుంచి 17 వరకు జరిగే మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశతో పాటు ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ లు అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డీసీ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు హోం గేమ్స్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్.. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ఏప్రిల్ 3న కేకేఆర్‌తో విశాఖలో ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన ఐదు హోం గేమ్స్‌ను సొంత మైదానంలోనే ఆడుతుంది.
హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే హైదరాబాద్ అభిమానులు కూడా ఈసారి మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్.. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొననుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion