Virat Kohli 1st Post After RCB Win: ఆర్సీబీ కప్ కొట్టాక విరాట్ కోహ్లీ ఫస్ట్ పోస్ట్ చూశారా.. ఇన్నేళ్లు బాధను ఎలా దిగమింగాడో!
RCB Win IPL 2025 | ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా ఆర్సీబీ నిలిచింది. తొలి సీజన్ నుంచి ఇదే జట్టుకు ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగంతో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

IPL 2025 Winner: ఐపీఎల్ కప్ కొట్టాలన్న RCB కల ఎట్టకేలకు నెరవేరింది. మ్యాచ్ చివరి ఓవర్ సమయంలోనే భావోద్వేగానికి లోనైన విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకోవడాన్ని ఎవరూ మరిచిపోరు. ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన తర్వాత, విరాట్ కోహ్లీ తన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో RCB ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని సాధించగా, అందరి దృష్టి విరాట్ కోహ్లీ మీదే పడింది. ఆ సమయంలో కోహ్లీ కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. ఎన్నో ఏళ్ల పోరాటం, కప్ సాధించాలన్న తాపత్రయంతో జెర్సీ నెంబర్ 18 వీరుడు 18వ సీజన్ విజేతగా నిలిచాడు.
విరాట్ కోహ్లీ విన్నింగ్ పోస్ట్
విరాట్ కోహ్లీ తన జట్టుతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఫోటోలను షేర్ చేసుకున్నాడు. "ఈ జట్టు నా కలను సాకారం చేసింది. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సీజన్ ఇది. గత రెండున్నర నెలలు మేం చాలా ఆనందంగా గడిపాం. కష్టకాలంలో అభిమానులు ఆర్సీబీ టీం వెంటే ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ అన్ని సంవత్సరాల నిరాశ, బాధకు చెక్ పెట్టింది. జట్టు కోసం చేయాల్సిందంతా చేశాం. ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడి తమ వంతు ప్రయత్నం చేశారు. IPL ట్రోఫీ విషయానికొస్తే 18 సంవత్సరాలు వేచి ఉన్నాం. ఇంతకాలం తరువాత సాధించిన విజయం గొప్పది, ఎంతో విలువైనదే. ఈ క్షణం కోసం వేచి ఉన్నందుకు అమూల్యమైన ఫలితం వచ్చింది’ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆర్సీబీ నుంచి టాప్ స్కోరర్ కోహ్లీనే. కప్పు కోసం ఫైనల్లోనూ బ్యాటింగ్ బారాన్ని మోశాడు కింగ్ కోహ్లీ.
View this post on Instagram
టీమిండియా కోసం ఎలాగైతే పరుగుల వరద పారించాడో, ఆర్సీబీ కోసం సైతం కోహ్లీ అదే రేంజ్‌లో చెమటోడ్చాడు. తనను నమ్ముకున్న జట్టు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశాడు. చివరగా 18వ సీజన్లో ఆర్సీబీకి కప్పు సాధించాడు అనడంలో ఏ సందేహం లేదు. జెర్సీ నెంబర్ 18 కాగా, యాధృచ్చికంగా ఐపీల్ 18వ సీజన్లో ఆర్సీబీ తొలి కప్ నెగ్గింది. తేదీ పరంగా చూసినా నెంబర్లు కలిపితే 18 రావడం కోహ్లీకి కలిసొస్తుందన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరకు IPL ట్రోఫీని అందుకుంది. తన భర్త విరాట్ కోహ్లీ 18 ఏళ్లపాటు ఈ కప్ కోసం ఎదురుచూశాడు. దాంతో అనుష్క శర్మ సైతం ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. RCB పంజాబ్ కింగ్స్‌ను ఓడించి IPL ట్రోఫీని గెలుచుకోగా అనుష్క శర్మ సైతం భావోద్వేగాలకు లోనయ్యారు. భర్త కోహ్లీని హగ్ చేసుకుని నువ్వు సాధించావ్, నీ కల నెరవేరింది అన్నట్లుగా ట్రీట్ చేసింది.
ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ సంబరాలను బెంగళూరులో నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్సీబీ జట్టు విజయయాత్ర ప్రారంభం కానుంది. అసెంబ్లీ నుంచి నగరంలోని చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విక్టరీ పరేడ్ కు ప్లాన్ చేశారు.





















