Betting On RCB: ఆర్సీబీ విజయంతో కెనడా ర్యాపర్ జాక్‌పాట్, బెట్టింగ్‌లో ఏకంగా ఎన్ని కోట్లు గెలిచాడంటే..
Ee Sala Cup Namde| కెనడా ర్యాపర్ డ్రేక్ ఆర్సీబీ విజయాన్ని ముందే ఊహించి, భారీ బెట్టింగ్ వేశాడు. పంజాబ్ మీద జరిగిన ఫైనల్లో ఆర్సీబీ విజయంతో కోట్ల రూపాయాల జాక్ పాట్ కొట్టాడు.

RCB vs PBKS IPL 2025 Final: IPL 2025 టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) నిరీక్షణ ఫలించింది. 17 ఏళ్ల తమ కలను 18వ ఏట సాకారం చేసుకుంది బెంగళూరు జట్టు. అయితే తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న ఏకైన ఆటగాడు విరాట్ కోహ్లీ కెరీర్ లో లోటు అంటే ఐపీఎల్ కప్. మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను ఓడించి ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిందని తెలసిందే. అయితే ఐపీఎల్ ఫైనల్ సంద్భంగతా వేసిన ఓ బెట్టింగ్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఫైనల్ గా అతడు ఆ బెట్టింగ్ లో గెలిచాడు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో పంజాబ్ మీద విజయం సాధించింది ఆర్సీబీ. దాంతో ఆర్సీబీ విజయాన్ని ముందే ఊహించి భారీ బెట్టింగ్ వేసిన సెలబ్రిటీ పంట పండింది. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025 ఫైనల్లో విజయం సాధిస్తుందని కెనడాకు చెందిన ర్యాపర్, గ్రామీ అవార్డు విజేత డ్రేక్ ఏకంగా 750,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 6,41,08,974 రూపాయలు) బెట్టింగ్ వేశాడు. ఆర్సీబీ గెలిస్తే కెనడా ర్యాపర్ ₹10.94 కోట్లకు పైగా (సుమారు $1.312 మిలియన్లు) అందుకుంటాడని సమాచారం. ఫైనల్ కు ముందే ఈ బెట్టింగ్ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో డ్రేక్ షేర్ చేయడంతో వైరల్ అయింది.
ఆర్సీబీ గెలిస్తే అతడికి లాభమెంత..
ర్యాపర్ డ్రేక్ ఆర్సీబీ విజయం సాధిస్తుందని భారీ బెట్టింగ్ వేశాడని తెలియగానే అంతా షాకయ్యారు. ఈ సాలా కప్ నమదే అంటూ ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి వింటున్నాం. అతడు డబ్బులు పోగొట్టుకుంటాడని అంతా అనుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. దాంతో కెనడా ర్యాపర్ డ్రేక్ 4.5 కోట్లకు పైగా లాభాన్ని పొందాడు. అతడికి మొత్తం వచ్చేది రూ.10.94 కోట్లు కాగా, అందులో అతడు బెట్టింగ్ వేసిన మొత్తం రూ.6.41 కోట్లు. ఆర్సీబీ గెలిస్తే 1.7 రెట్లు ఆర్జిస్తాడని ముందే తెలిసింది. అంటే పంజాబ్ విజయంపైనే ఎక్కువగా బెట్టింగ్ వేశారనడానికి ఇది నిదర్శనం.

3 ఫైనల్స్‌లోనూ ఓటమి, నాలుగో ప్రయత్నంలో విజయం
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్ చేరింది. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరినా చివరిమెట్టుపై బోల్తా పడి మూడు పర్యాయాలు ఆర్సీబీ జట్టు రన్నరప్ గా నిలిచింది. నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన పైనల్లో విజయంతో 18 ఏళ్ల తమ ఐపీఎల్ ట్రోఫీ కలను ఆర్సీబీ సాకారం చేసుకుంది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో ఆర్సీబీ నుంచి టాప్ స్కోరర్ గా నిలిచి జట్టును నడిపించాడు.
పంజాబ్ బ్యాడ్ లక్..
ఈ సీజన్లో పంజాబ్ ఓడింది కొన్ని మ్యాచ్‌లే. కానీ అందులో మూడు పర్యాయాలు ఆర్సీబీ చేతిలోనే ఓడింది. లీగ్ స్టేజీలో ఒకసారి, క్వాలిఫయర్ 1లో మరోసారి ఓడింది. ఫైనల్లో ఆర్సీబీ మీద పంజాబ్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకున్నారు. కానీ ఆర్సీబీ ఫైనల్లోనూ పంజాబ్ కు ఛాన్స్ ఇవ్వలేదు. మహిళల జట్టు లీగ్ మొదలైన కొన్ని సీజన్లకే కప్పు కొట్టగా, ఆర్సీబీ పరుషుల జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ కలను తాజాగా సాకారం చేసుకుంది.





















