News
News
వీడియోలు ఆటలు
X

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో అదిరిపోయే రికార్డు - మొదటి బ్యాటర్ కోహ్లీనే!

DC vs RCB, Royal Challengers Bangalore, Delhi Capitals, VIRAT KOHLI

FOLLOW US: 
Share:

DC vs RCB, Virat Kohli, Royal Challengers Bangalore: IPL 2023 50వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చారు. ఇద్దరూ తమ జట్టుకు శుభారంభం అందించారు.

చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను అక్షర్ పటేల్ చేశాడు. ఈ ఓవర్ ఐదో బంతికి విరాట్ కోహ్లి ఫోర్ కొట్టడంతో 12 పరుగులు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన వెంటనే విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఏడు వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కోహ్లీ ఐపీఎల్‌లో 232 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 224 ఇన్నింగ్స్‌లలో 36.59 సగటు, 129.58 స్ట్రైక్ రేట్‌తో 6,988 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు ఐదు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్
ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 45.50 సగటు, 137.88 స్ట్రైక్ రేట్‌తో 364 పరుగులు చేశాడు. అతను ఆరెంజ్ క్యాప్ రేసులోనే ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 212 ఇన్నింగ్స్‌ల్లో 6536 పరుగులు చేసిన శిఖర్ ధావన్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఐదో స్థానంలో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు
విరాట్ కోహ్లీ: 7043 పరుగులు
శిఖన్ ధావన్: 6536 పరుగులు
డేవిడ్ వార్నర్: 6189 పరుగులు
రోహిత్ శర్మ: 6063 పరుగులు
సురేష్ రైనా: 5528 పరుగులు

మరోవైపు ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వివాదాల్లో కూడా చిక్కుకుంటున్నాడు. ఏకనా స్టేడియంలో సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్ (Lucknow Super Giants), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Roayal Challengers Bangalore) తలపడ్డాయి. ఈ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఛేదనలో లక్నో బ్యాటర్లు ఔటైన ప్రతిసారీ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అతిగా స్పందించాడు. ఎక్కువ అగ్రెసివ్‌గా కనిపించాడు. ఈ సీజన్‌ మొదటి మ్యాచులో చిన్నస్వామిలో లక్నో ఆఖరి బంతికి ఉత్కంఠకర విజయం సాధించింది. అప్పుడు ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి.. గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) నోర్మూసుకోండి అని సైగలు చేశాడు. ఇందుకు ప్రతీకారంగానే విరాట్ అతిగా స్పందించినట్టు అనిపిస్తోంది.

మ్యాచు ముగిశాక గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీ ఒకర్నొకరు హ్యాండ్ షేక్‌ ఇచ్చుకున్నారు. దాంతో అంతా ప్రశాంతంగానే ఉందనిపించింది. కాసేపయ్యాక లక్నో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌.. కోహ్లీ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే గంభీర్‌ ఎంటరయ్యాడు. మేయర్స్‌ను పక్కు తీసుకెళ్లి ఏదో చెప్పాడు. కోహ్లీని ఉద్దేశించి ఏవో మాటలు అన్నాడు. దాంతో అతడు గంభీర్ దగ్గరికి వచ్చి దీటుగా ప్రతిస్పందించాడు. గొడవ పెద్దది అవుతుందనిపించడంతో రెండు జట్ల ఆటగాళ్లు, సపోర్ట్‌ స్టాప్‌ వారిద్దరినీ విడదీశారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Published at : 06 May 2023 10:40 PM (IST) Tags: Delhi Capitals DC Vs RCB VIRAT KOHLI Royal Challengers Bangalore

సంబంధిత కథనాలు

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం