అన్వేషించండి

SRH vs MI IPL 2024: ఊచకోత అంటే ఇదీ భయ్యా, IPL చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్

SRH vs MI IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి  277 పరుగుల భారీ స్కోరు చేసింది.

IPL 2024 Highest Team Score In IPL History Sunrisers Hyderabad 277 Runs:  అసలైన ఊచకోత అంటే ఇదేనేమో... బంతిపై పగ బట్టినట్లు... బౌలర్లపై ఎప్పటినుంచో కసి పెంచుకున్నట్లు సొంత వేదిక ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. బౌలింగ్‌ చేయాలంటే బౌలర్లు వణికిపోయేంత... ఫీల్డర్లు నిశ్చేష్టులై నిలబడిపోయేంత, అంపైర్ల చేతులు నొప్పి పుట్టేంతగా హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసం సాగింది. ట్రానిస్‌ హెడ్‌తో మొదలైన తుపాను అభిషేక్ శర్మతో సునామీగా మారి.. మార్‌క్రమ్‌ రూపంలో ముంబై బౌలర్లను ముంచెత్తింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన బ్యాటర్ల విశ్వరూపంతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి  277 పరుగుల భారీ స్కోరు చేసింది. బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు అందరూ సన్‌రైజర్స్‌ సునామీలో కొట్టుకుపోయారు. 

ఇది ఊచకోతంటే... 
హైదరాబాద్‌ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ట్రానిస్‌ హెడ్‌ 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేయగా... తానేం తక్కువ తినలేదంటూ అభిషేక్‌ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. దొరికిన బంతిని దొరికినట్లు హైదరాబాద్‌ బ్యాటర్లు బాదేశారు. బంతిపై ఏదో కసి ఉన్నట్లు ఊగిపోయారు. బంతి వేయడానికే బౌలర్లు వణికిపోయేంత విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్‌ చరిత్రలోనే హైదరాబద్‌ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఉప్పల్‌ స్టేడియంలో బౌండరీల మోత మోగుతోంది. మఫాకా వేసిన 10 ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 16 బంతుల్లోనే అభిషేక్‌ శర్మ (54*) హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్‌ స్కోర్‌ 148/2. 22 బంతుల్లోనే 63 పరుగులు చేసి అభిషేక్‌ అవుటయ్యాడు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అభిషేక్‌ అవుటయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సులతో అభిషేక్‌ 63 పరుగులు చేశాడు. ట్రానిస్‌ హెడ్‌ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి మఫాక మూడు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. హెడ్‌, అభిషేక్‌ బ్యాటింగ్‌ జోరుతో హైదరాబాద్‌ ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి 58 పరుగులు చేసింది. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 81 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్‌కు పవర్‌ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. 2017లో కోల్‌కత్తాపై హైదరాబాద్‌ 79 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్‌లో 81 పరుగులు చేసింది.  ట్రానిస్‌ హెడ్‌- అభిషేక్‌ వర్మ కేవలం 23 బంతుల్లోనే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ కూడా రాణించడంతో సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డు.... బుల్లెట్‌ వేగంతో దూసుకుపోయింది.క్లాసెన్‌  24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లతో  అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇది మూడో హాఫ్‌ సెంచరీ బ్యాటర్ల విధ్వంసంతో 15 ఓవర్లలోనే హైదరాబాద్‌ స్కోరు 200 పరుగులు దాటింది. 19 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 256 కాగా బ్యాటర్ల విశ్వరూపంతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా  సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డులకు ఎక్కింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Embed widget