అన్వేషించండి

KKR vs PBKS Match Highlights : ఊచకోత ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు ఊపిరి- క్వాలిఫైయర్స్‌ టార్గెట్‌గా శశాంక్ సింగ్ బాదుడు  

PBKS News: కోల్‌కతా మర్చిపోలేని ఇన్నింగ్స్‌లలో శశాంక్ సింగ్ ఆడిన ఇన్నింగ్‌ ఒకటి. స్లో అండ్ స్టడీ అన్నట్టు విధ్వంసం సృష్టించిన ఇన్నింగ్స్‌ అది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేజ్ చేసింది పంజాబ్.

IPL 2024: టాలెంట్‌కు తోడు ప్రత్యర్థి ఎవరనే భయం లేకుండా ఈ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఎలాంటోడైనా ఇరగదీస్తాడు. శశాంక్ సింగ్ అదే చేశాడు. కళ్ల ముందు 262 పరుగుల లక్ష్యం. టీ20ల్లో దాదాపు అసాధ్యం. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ చేయలేదు అది. ఓ వైపు బెయిర్ స్టో సెంచరీ బాది నిలబడినా..ఇంకా విజయానికి అల్లంత దూరంలో ఉండాల్సిన పరిస్థితి. అలాంటి టైమ్‌లో క్రీజులోకి వచ్చాడు శశాంక్ సింగ్. 

ఇప్పటికే ఈ సీజన్‌లో తన మెరుపు ఇన్నింగ్స్‌లతో తనంటే ఏంటో నిరూపించుకున్న శశాంక్ సింగ్...కోల్‌కతా మీద మాత్రం కాళి మాత పూనినట్లు రెచ్చిపోయాడు. ముందు స్లోగా ఆడుతున్నాడా అనే డౌట్ వచ్చేలా ఆడి సడెన్‌గా గేర్లు మార్చి కావాల్సిన టార్గెట్ ముందుకు అవలీలగా తీసుకెళ్లిపోయాడు. వరుణ్ చక్రవర్తి, చమీరా, హర్షిత్ రానా ఇలా ఏ కోల్‌కతా బౌలర్‌ని వదిలిపెట్టకుండా వరుస సిక్కులతో వాళ్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. బంతిని అద్భుతంగా టైమింగ్ చేస్తూ పడిన బాల్ పడినట్లు స్టాండ్స్‌లోకి పంపాడు. 28 బంతులు మాత్రమే ఆడి 2ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో శశాంక్ సింగ్ బాదిన 68పరుగులే పంజాబ్ సంచలన ఛేజింగ్ చేసేలా సాయపడ్డాయి. 

ప్రభ్ సిమ్రన్ సింగ్ ఇచ్చిన స్టార్ట్, బెయిర్ స్టో చేసిన పోరాటానికి సరైన న్యాయం చేశాయి. సంచలన విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడిన శశాంక్ సింగ్ ఇలాంటివి ఇంకా రిపీట్ చేస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అంతే కాదు పంజాబ్ క్వాలిఫైయర్స్‌కి వెళ్లే అవకాశాలు ఇంకా మూసుకుపోలేదని.. క్వాలిఫైయర్స్‌కు వెళ్లి నిలబడేలా కచ్చితంగా పోరాడతానని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పి తన లక్ష్యం ఏంటో బలంగా చాటాడు శశాంక్ సింగ్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget