అన్వేషించండి

Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం

Arjun Tendulkar | పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో పేసర్ అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో, అతని ప్రదర్శనను, ఓర్పును సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అర్జున్ టెండూల్కర్ తన ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేశాడు.
  • సీజన్‌లో చివరి మ్యాచ్‌లో అవకాశం వచ్చినా అతను సత్తా చాటాడు.
  • కుమారుడి ఓర్పు, కృషిని సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు.

పంజాబ్ కింగ్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్ నిలిచాడు. ఈ సీజన్‌లో లీగ్ స్టేజీలో లక్నో జట్టుకు అదే చివరి మ్యాచ్ కాగా, సీజన్లో అర్జున్ టెండూల్కర్ ఆడిన తొలి, ఏకైక మ్యాచ్ ఇదే. ముంబై ఇండియన్స్ నుండి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వెళ్లిన తర్వాత, జట్టు వైఫల్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ అర్జున్‌కు ఈ సీజన్‌లో అవకాశాలు రాకపోవడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. చివరి మ్యాచులో ఛాన్స్ రావడంతో అర్జున్ రాణించడంపై సచిన్ హర్షం వ్యక్తం చేశారు.

చివరి మ్యాచ్ వరకూ వెయిట్ చేసిన అర్జున్ టెండూల్కర్

అయితే, ఎట్టకేలకు ఐపీఎల్ 2026 లీగ్ దశలో లక్నో ఆడిన చివరి మ్యాచ్‌లో అతనికి అవకాశం లభించింది. బంతితో అర్జున్ రాణించి, తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్ తర్వాత, అర్జున్ తండ్రి,  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుత్రోత్సాహానికి లోనయ్యాడు. కుమారుడు  అర్జున్ ప్రదర్శనను మాత్రమే కాకుండా అతని ఓర్పు, పట్టుదలను ప్రశంసిస్తూ ఒక మెస్సేజ్ పంచుకున్నారు. అవకాశం కోసం వేచి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం, హార్డ్ వర్క్ చేయడం, సీజన్ పొడవునా తన సామర్థ్యాలను నమ్మినందుకు కుమారుడు అర్జున్‌ను సచిన్ అభినందించారు.

అవకాశాలు రాకున్నా పాజిటివ్‌గా ఉన్నావు.. సచిన్ పోస్ట్

పంజాబ్‌తో జరిగిన మ్యాచులో లక్నో ఓడినప్పటికీ అర్జున్ టెండూల్కర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. దాంతో మ్యాచ్ పూర్తయ్యాక సచిన్ ఎక్స్  ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘వెల్ డన్ అర్జున్. ఈ సీజన్ మొత్తం నువ్వు నిన్ను మలుచుకున్న విధానం చూసి గర్వంగా ఉంది. నీ సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ నమ్ముతూ, ఓపికగా ఉండాలి. నిరంతరం శ్రమిస్తూ చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చినప్పటికీ పాజిటివ్‌గా ఉన్నావు. క్రికెట్ నీ నైపుణ్యాన్ని ఎంతగా పరీక్షిస్తుందో, నీ ఓర్పును కూడా అంతగా పరీక్షిస్తుంది. ఈ రోజు ఆ రెండింటినీ చాలా చక్కగా హ్యాండిల్ చేశావు. ఎప్పుడూ ఇలాగే ఒదిగి ఉండు. ఎప్పటిలాగే ఈ ఆటను మాత్రం ప్రేమిస్తూనే ఉండు. లవ్ యూ ఆల్‌వేస్’ అని సచిన్ భావోద్వేగంతో పోస్ట్ చేశారు.

Also Read: IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 

పంజాబ్‌తో మ్యాచులో రాణించిన అర్జున్ 
పంజాబ్ (PBKS), లక్నో (LSG) మధ్య జరిగిన  మ్యాచ్‌లో పవర్‌ప్లే పూర్తయిన వెంటనే అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. అతను వేసిన ఒక బౌన్సర్‌తో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఇబ్బంది పెట్టి వికెట్ తీసే అవకాశాన్ని క్రియేట్ చేశాడు. అయితే, కీపర్ రిషబ్ పంత్ ఆ సులువైన క్యాచ్‌ను వదిలివేయడంతో, మొదటి స్పెల్‌లో అర్జున్‌కు వికెట్ దక్కే అవకాశం చేజారింది. ఒకవేళ పంత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే ప్రభ్ సిమ్రన్ త్వరగా ఔట్ కావడంతో పంజాబ్ మీద ఒత్తిడి పెరిగేది. ఈ మ్యాచులో ప్రభ్ సిమ్రన్ (39 బంతుల్లో 69, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ అజేయ సెంచ‌రీ (51 బంతుల్లో 101 నాటౌట్, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

చివరకు ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఒక అద్భుతమైన యార్కర్‌తో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఎల్‌బిడబ్ల్యూ (LBW) గా అవుట్ చేసి వికెట్ తీశాడు. అర్జున్ తన నాలుగు ఓవర్లలో 1/36 తో పరవాలేదనిపించాడు. కేవలం 9 ఎకానమీ రేటుతో బౌలింగ్ కోటా పూర్తి చేయగా.. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లందరిలో ఎకానమీలో ఇదే బెస్ట్ బౌలింగ్. 

లక్నో పేసర్ మహ్మద్ షమీ నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇవ్వగా, ప్రిన్స్ యాదవ్ 3 ఓవర్లలో 10 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో 32 పరుగులు ఇచ్చాడు. మోహ్సిన్ ఖాన్ తన 4 ఓవర్ల స్పెల్‌లో 48 పరుగులు సమర్పించుకోగా, స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ 3 ఓవర్లలో 13 ఎకానమీతో పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు.

Frequently Asked Questions

ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌లో ఆడే అవకాశం వచ్చిందా?

అవును, ఐపీఎల్ 2026 లీగ్ దశలో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన చివరి మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌కు ఆడే అవకాశం లభించింది.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన ఎలా ఉంది?

అర్జున్ టెండూల్కర్ ఆ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి, ఒక వికెట్ తీశాడు. అతని ఎకానమీ రేటు 9.00 గా ఉంది, ఇది ఆ మ్యాచ్‌లో లక్నో బౌలర్లందరిలో అత్యుత్తమమైనది.

అర్జున్ టెండూల్కర్‌పై సచిన్ టెండూల్కర్‌కు ఎలాంటి అభిప్రాయం కలిగింది?

సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్‌ను అవకాశం కోసం ఓపికగా వేచి చూసిన విధానాన్ని, పట్టుదలను, సానుకూల దృక్పథాన్ని ప్రశంసించారు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌కు వికెట్ తీసే తొలి అవకాశం ఎప్పుడు వచ్చింది?

మ్యాచ్‌లో పవర్‌ప్లే పూర్తయిన వెంటనే బౌలింగ్‌కు వచ్చిన అర్జున్, పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఔట్ చేసే అవకాశం సృష్టించాడు, కానీ కీపర్ క్యాచ్‌ను వదిలివేశాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mahela Jayawardene Steps Down: 3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
Vaas Bowling Mastermind: వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్  ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్ ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
Chahal Dark Phase: చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget