అన్వేషించండి

IPL 2026 Playoff Race Intensifies: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ: పంజాబ్ కింగ్స్ గెలుపుతో మారిన స‌మీక‌ర‌ణాలు

లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ గెలవడంతో ఐపీఎల్ చివరి ప్లేఆఫ్స్ స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

IPL 2026 Playoff Race Intensifies After Punjab Kings Thrashing Win: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లో ఆఖరి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం రేసు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆదివారం జరగబోయే ఆఖరి లీగ్ మ్యాచ్‌లతో నాలుగో స్థానం ఎవరిదనేది తేలనుంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై పంజాబ్ కింగ్స్ (PBKS) సంచలన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో (101 నాటౌట్) చెలరేగడంతో లక్నో నిర్దేశించిన 197 పరుగుల భారీ టార్గెట్‌ను పంజాబ్ కేవలం 18 ఓవర్లలోనే చేజ్ చేసింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. లక్నో జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం 8 పాయింట్లతో టేబుల్ లో ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది.

Read Also: Virat Kohli Smashes Sensational World Record: కోహ్లీ వండర్ఫుల్ బ్యాటింగ్ - టీ20ల్లో ఆ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్ 

ప్లేఆఫ్స్ రేసు నుండి డీసీ ఔట్..

పంజాబ్ కింగ్స్ సాధించిన ఈ భారీ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే ఆఖరి మ్యాచ్ లో గెలిచినా ఆ జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. పంజాబ్ ఇప్పటికే 15 పాయింట్లతో ఉండటంతో అక్ష‌ర్ ప‌టేల్ సేన టోర్నమెంట్ నుండి అధికారికంగా నిష్క్రమించింది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రేసులో నిలిచాయి.

Read Also: IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్

పంజాబ్ సమీకరణాలు.. 

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ (NRR) +0.309 గా మెరుగ్గా ఉంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే ఆదివారం మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ కచ్చితంగా ఓడిపోవాలి. అలాగే రాత్రి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయం పాలుకావాలి. ఒకవేళ కేకేఆర్ గెలిచినా, పంజాబ్ రన్ రేట్‌ను దాటలేనంత చిన్న మార్జిన్‌తో మాత్రమే విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడే పంజాబ్‌కు తదుపరి రౌండ్ ఛాన్స్ దక్కుతుంది.

రాజస్థాన్, కోల్‌కతా జట్లకు ఉన్న అవకాశాలు

రియాన్ పరాగ్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ సమీకరణం చాలా సింపుల్‌గా ఉంది. ఆదివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ లో గెలిస్తే చాలు, 16 పాయింట్లతో నేరుగా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. మరోవైపు 13 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆశలు సజీవంగా ఉండాలంటే మొదట ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి. ఆ తర్వాత చివరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కేకేఆర్ భారీ రన్ రేట్ మార్జిన్‌తో ఓడించి, పంజాబ్ నెట్ రన్ రేట్‌ను అధిగమించాల్సి ఉంటుంది. ఈ ఆదివారం మ్యాచ్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
Wamiqa Gabbi : వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
MrBeast 500 Million YouTube Subscribers:యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
Embed widget