RR Vs SRH: సన్‌రైజర్స్‌ను బాదేసిన బట్లర్, సంజు - భారీ స్కోరు చేసిన రాజస్తాన్!
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 52వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్ (95: 59 బంతుల్లో, 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంజు శామ్సన్ (66 నాటౌట్: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి చెలరేగాడు. సన్‌రైజర్స్ విజయానికి 120 బంతుల్లో 215 పరుగులు అవసరం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఎప్పటిలానే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. ఫోర్లు, సిక్సర్లతో మంచి ఊపు మీదున్న యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేసి మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్‌కు మొదటి వికెట్‌ను అందించాడు.
అయితే రాజస్తాన్ అసలు ఆట అప్పుడే మొదలైంది. క్రీజులో ఉన్న జోస్ బట్లర్‌కు కెప్టెన్ సంజు శామ్సన్ తోడయ్యాడు. వీరు రెండో వికెట్‌కు 13.3 ఓవర్లలోనే 148 పరుగులు జోడించారు. ప్రారంభంలో కొంచెం మెల్లగా ఆడిన ఈ జోడి క్రీజులో కొంచెం కుదురుకున్నాక చెలరేగిపోయింది. మిడిల్ ఓవర్లలో కూడా వీరు అద్భుతమైన రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. సెంచరీకి చేరువలో ఉండగా భువీ వేసిన అద్భుతమైన యార్కర్‌తో జోస్ బట్లర్ పెవిలియన్ బాట పట్టాడు. కానీ సంజు శామ్సన్ ఎక్కడా తగ్గకుండా పరుగులు చేయడంతో రాజస్తాన్ భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్, భువనేశ్వర్‌లకు చెరో వికెట్ దక్కింది.
Innings Break!@rajasthanroyals post a formidable total of 214/2 on the board.#SRH chase coming up shortly. Stay tuned!
— IndianPremierLeague (@IPL) May 7, 2023
Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/cFL1SfTMEZ
పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలోనూ, రాజస్తాన్ రాయల్స్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరనుంది. ఇక సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి లేదా తొమ్మిదో స్థానానికి చేరనుంది. రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
దేవదత్ పడిక్కల్, ఆడమ్ జంపా, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, ఒబెడ్ మెక్‌కాయ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హ్యారీ బ్రూక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ దాగర్, నితీష్ రెడ్డి, సన్వీర్ సింగ్