RR vs RCB, IPL 2022 LIVE: RR vs RCB, IPL 2022 Live score updates: డీకే అటాక్‌కు రాజస్థాన్ విలవిల! బెంగళూరుకు రెండో విక్టరీ
IPL 2022 RR vs RCB Live Updates: రాజస్థాన్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. చివరి మ్యాచ్ గెలిచిన బెంగళూరు ఐదు రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతోంది. మరి వీరిద్దరిలో (RR vs RCB) ఎవరిది పై చేయి?
LIVE
Background
Royals vs Royal Challengers bangalore playing xi head to head records in ipl : ఐపీఎల్ 2022 సీజన్ 13వ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. వాంఖడే (Wankhede Stadium) ఇందుకు వేదిక. వరుసగా రెండు మ్యాచులు గెలిచిన రాజస్థాన్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. చివరి మ్యాచ్ గెలిచిన బెంగళూరు ఐదు రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతోంది. మరి వీరిద్దరిలో (RR vs RCB) ఎవరిది పై చేయి? వాంఖడేలో గెలిచేదెవరు? తుది జట్టులో ఎవరెవరు ఉంటారు?
Rajasthan Royals ఫైర్!
గతేడాది పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన రాజస్థాన్ రాయల్స్ ఈ సారి దుమ్మురేపుతోంది. వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోవడంతో జట్టు పరిస్థితి మారిపోయింది. భీకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో ట్రోఫీ రేసులో ఉందనిపిస్తోంది. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ రెండుసార్లు తమ స్కోర్లను డిఫెండ్ చేసుకుంది సంజు శామ్సన్ (Sanju Samson) సేన. మరోవైపు డుప్లెసిస్ (Faf Du Plessis) నాయకత్వంలో జోష్‌లో కనిపిస్తున్న బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌లో కాస్త ఒత్తిడి ఎదుర్కొంటోంది. మాక్స్‌వెల్ (Glenn Maxwell) వస్తే మరింత మెరుగ్గా మారుతుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) స్వేచ్ఛగా ఆడుతుండటం ఊరట కలిగించే అంశం.
RR vs RCB, అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL 2022) రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డాయి. ఈ రెండు జట్లు సమవుజ్జీలుగానే ఉన్నాయి. అయితే రాజస్థాన్‌దే కాస్త అప్పర్ హ్యాండ్! ఆ జట్టు 12 గెలిస్తే బెంగళూరు 10 గెలిచింది. అయితే చివరగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో బెంగళూరు 4-0 ఆధిపత్యం చెలాయించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
* రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కదగ్గరకు చేరడంతో రాజస్థాన్ స్పిన్ బౌలింగ్ భయంకరంగా మారింది. ట్రెంట్‌బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ భీకరంగా ఉంది.
* బెంగళూరు ఎక్కువగా స్పిన్నర్ వనిందు హసరంగ, పేసర్ హర్షల్ పటేల్ మీద ఆధారపడింది. వీరిద్దరూ బాగా ఆడుతున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ 9 నుంచి వస్తాడు.
* ప్రసిద్ధ్, బౌల్ట్ బౌలింగ్‌లో కోహ్లీ మంచి రికార్డు ఉంది. వీరిద్దరిపై 140 స్ట్రైక్‌రేట్ ఉంది.
* హసరంగ బౌలింగ్‌లో సంజుకు మెరుగైన రికార్డు లేదు. 4 టీ20ల్లో 11 బంతులాడి 3 సార్లు ఔటయ్యాడు. బట్లర్ సైతం ఇలాగే ఉన్నాడు.
* ఐపీఎల్ 2021 నుంచి యుజ్వేంద్ర చాహల్ 17 మ్యాచులో 23 వికెట్లు తీశాడు. ఇలాంటి రికార్డు మరే స్పిన్నర్‌కు లేదు.
RR vs RCB probable xi
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, డేవిడ్ విలే, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రన్ హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
RR vs RCB, IPL 2022 Live score updates: డీకే అటాక్‌కు రాజస్థాన్ విలవిల! బెంగళూరుకు రెండో విక్టరీ
యశస్వీ జైశ్వాల్ వేసిన తొలి బంతిని హర్షల్ సిక్సర్‌గా బాదేసి బెంగళూరుకు 4 వికెట్ల తేడాతో విక్టరీ అందించాడు. డీకే (44) సూపర్బ్ ఇన్సింగ్స్ ఆడాడు.
RR vs RCB, IPL 2022 Live score updates: 19 ఓవర్లకు బెంగళూరు 167-6
ప్రసిద్ధ్ 12 పరుగులు ఇచ్చాడు. డీకే (44) వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. హర్షల్ (3) అతడికి తోడుగా ఉన్నాడు.
RR vs RCB, IPL 2022 Live score updates: 18 ఓవర్లకు బెంగళూరు 155-6
ట్రెంట్ బౌల్ట్ 13 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఒక బౌండరీ, ఒక సిక్సర్ బాదేసిన షాబాజ్ (45)ను ఔట్ చేశాడు. హర్షల్ పటేల్ (1), డీకే (35) ఆడుతున్నారు.
RR vs RCB, IPL 2022 Live score updates: 17 ఓవర్లకు బెంగళూరు 141-5
యూజీ చాహల్ 4 పరుగులే ఇచ్చాడు. దినేశ్ కార్తీక్ (35), షాబాజ్ (33) రిస్క్ తీసుకోలేదు.
RR vs RCB, IPL 2022 Live score updates: 16 ఓవర్లకు బెంగళూరు 138-5
ప్రసిద్ధ్ 13 పరుగులు ఇచ్చాడు. షాబాజ్ అహ్మద్ ( 31) ఒక బౌండరీ, ఒక సిక్సర్ కొట్టేశాడు. డీకే (33) అతడికి తోడుగా ఉన్నాడు.