By: ABP Desam | Updated at : 27 Apr 2023 11:57 PM (IST)
వికెట్ తీసిన ఆనందంలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు ( Image Source : PTI )
Rajasthan Royals vs Chennai Super Kings: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 32 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో రాజస్తాన్ రాయల్స్‌కు విజయం దక్కింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఇది వరుసగా రెండో ఓటమి.
రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్‌లో యశస్వి జైస్వాల్ (77: 43 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో శివం దూబే (52: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు పడగొట్టాడు.
చెన్నై బ్యాటింగ్ ఇలా
203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ మెల్లగా ప్రారంభం అయింది. పవర్‌ప్లేలో చెన్నై ఓపెనర్లు కేవలం 42 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆరో ఓవర్ చివరి బంతికి ఆడం జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డెవాన్ కాన్వే (8: 16 బంతుల్లో) అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రుతురాజ్ గైక్వాడ్‌ను (47: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ఆడం జంపానే పెవిలియన్‌కు పంపాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ చెన్నైని చావుదెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో ఫాంలో ఉన్న అజింక్య రహానే (15: 13 బంతుల్లో), అంబటి రాయుడులను (0: 2 బంతుల్లో) అవుట్ చేశాడు.
అయితే మొయిన్ అలీ (23: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), శివం దూబే (52: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చెన్నై శిబిరంలో ఆశలు రేపారు. వీరు ఐదో వికెట్‌కు కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. మొయిన్ అలీ అవుటయ్యే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 31 బంతుల్లో 78 పరుగులు కావాలి. ఆ తర్వాత శివం దూబే, రవీంద్ర జడేజా (23: 15 బంతుల్లో, మూడు ఫోర్లు) ఎంత పోరాడినా లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు.
రాజస్తాన్‌కు మెరుపు ఆరంభం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జోస్ బట్లర్ (27: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు), యశస్వి జైస్వాల్ (77: 43 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) రాజస్తాన్‌కు ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. ఆకాష్ సింగ్ వేసిన మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ మూడు ఫోర్లు కొట్టాడు. వీరిద్దరూ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో రాజస్తాన్ రాయల్స్ మొదటి ఆరు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా వీరి జోరు తగ్గలేదు. ఏడు, ఎనిమిది ఓవర్లలో 22 పరుగులు రాబట్టారు. అయితే తొమ్మిదో ఓవర్లో జోస్ బట్లర్‌ను అవుట్ చేసి రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌కు మొదటి వికెట్ అందించాడు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సంజు శామ్సన్ (17: 17 బంతుల్లో, ఒక ఫోర్) వేగంగా ఆడలేకపోయాడు. రెండో వికెట్‌కు యశస్వి జైస్వాల్‌తో కలిసి 39 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.
కాసేపటికే యశస్వి జైస్వాల్, షిమ్రన్ హెట్‌మేయర్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యారు. అయితే ఈ దశలో ధ్రువ్ జురెల్ (34: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (23 నాటౌట్: 13 బంతుల్లో, ఐదు ఫోర్లు) రాజస్తాన్‌ను ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు కేవలం 20 బంతుల్లోనే 48 పరుగులు జోడించారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 200 పరుగుల మైలురాయిని దాటింది.
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల