Rohit Sharma: ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై రోహిత్ శర్మ పోస్ట్ వైరల్
MS Dhoni and Rohit sharma : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ఎమ్మెస్ ధోనీ దిగిపోవడంపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
Rohit Sharma Comments On Ms Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని(Ms Dhoni) తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ(Rohit Sharma) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ(Instagram Story)లో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది. దీనికితోడు క్యాప్షన్ లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడం... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ కి గుడ్బై చెప్పడంతో ఐపీల్ లో ఒక శకం ముగిసింది... ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ టోర్నీకి ధోమి వీడ్కోలు పలికే అవకాశలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ధోనీ ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగారని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు ఎమ్మెస్ ధోనీ తనదైన స్టైల్లో మరోసారి కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. కెప్టెన్స్ ఫొటోషూట్ కు ముందే ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్కే సీఈవోకు వెల్లడించాడట. ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోయిన కాసేపటికే రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ చేశాడు. అందులో ఇద్దరూ కెప్టెన్‌లుగా ఉన్న సమయంలో టాస్ వెళ్లినప్పటి ఫొటోను షేర్ చేశాడు. కింద సింపుల్ గా హ్యాండ్ షేక్ ఎమోజీని ఉంచాడు. 16 ఏళ్ల పాటు ఐపీఎల్లో సీఎస్కేకు కెప్టెన్ గా ఉన్న ధోనీకి శుభాకాంక్షలు చెబుతూనే.. ఈ ఫొటోతో అతడు మరో సందేశాన్ని కూడా ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రోల్స్
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసేసి, హార్దిక్ ను నియమించి రెండు నెలలైపోతోంది. మెల్లగా ఎలాగోలా ఈ ఫ్యాక్ట్ కు అడ్జస్ట్ అవుదామని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నా, హార్దిక్ మాత్రం తన ఆఫ్ ఫీల్డ్ బిహేవియర్‌తో అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు.
సీజన్ ముందు హార్దిక్ పాండ్య, కోచ్ మార్క్ బౌచర్‌తో ముంబయి ఇండియన్స్ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. కోచ్ మార్క్ బౌచర్‌ను ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న అడిగాడు. ఇకపై ముంబయి కెప్టెన్ గా రోహిత్ ఉండకూడదని, అదే సమయంలో హార్దిక్ ఎందుకు ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ కు అనిపించిందో చెప్పగలరా అని అడిగాడు. బౌచర్ వద్ద నుంచి నో ఆన్సర్. క్వశ్చన్ అవాయిడ్. తర్వాత అదే రిపోర్టర్ నుంచి హార్దిక్ పాండ్యకు ప్రశ్నలు వచ్చాయి. ముంబయికి తిరిగి వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తూనే.... మీరు ముంబయికి రావాలంటే కెప్టెన్సీ కచ్చితంగా కావాలనే క్లాజ్ కాంట్రాక్ట్ లో ఉందంట కదా అని అడిగాడు. హార్దిక్ నవ్వి ఊరుకున్నాడు. తమ మీడియా మేనేజర్ వైపు తిరిగాడు. అంటే మళ్లీ క్వశ్చన్ స్కిప్.
ఇలా కెప్టెన్ అండ్ కోచ్ ఈ ప్రశ్నలు స్కిప్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాటికి సమాధానాలు కష్టమే అని అందరికీ తెలుసని, డ్రెస్సింగ్ రూం లోపల ఎలాంటి విషయాలు జరిగినా పర్లేదని, కానీ ప్రపంచమంతా చూసే ప్రెస్ మీట్లలో ఇలాంటి క్వశ్చన్స్ కు కాస్త కవర్ చేస్తున్నట్టుగా, మర్యాదపూర్వకంగా జవాబిస్తే సరిపోయేదని, ఇలా అవాయిడ్ చేయడం వల్ల గొడవలు ఉన్నాయని కచ్చితంగా చెప్తున్నట్టే అని ఫ్యాన్స్ అంతా హార్దిక్ తీరుపై మండిపడుతున్నారు.