News
News
వీడియోలు ఆటలు
X

RCB Vs KKR: ఆర్సీబీపై ఆండ్రీ రసెల్‌కు తిరుగులేని రికార్డు - మ్యాచ్‌లో మెరుపులు ఖాయమేనా!

ఆండ్రీ రసెల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఈడెన్ గార్డెన్స్‌లో మంచి రికార్డు ఉంది.

FOLLOW US: 
Share:

Andre Russell vs RCB At Eden Gardens: IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్‌ తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. నిజానికి ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రస్సెల్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి.

ఈడెన్ గార్డెన్స్‌లో ఆండ్రీ రస్సెల్ రికార్డులు అద్భుతం
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చాలా వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. లెక్కల ప్రకారం చూస్తే... ఇప్పటి వరకు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆండ్రీ రస్సెల్ 395 పరుగులు చేశాడు.

ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆండ్రీ రస్సెల్‌కు ఏ జట్టు పైన అయినా ఇదే అత్యధిక స్కోరు. ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆండ్రీ రస్సెల్ 207.89 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. అదే సమయంలో ఆండ్రీ రస్సెల్ యావరేజ్ కూడా అద్భుతంగా ఉంది.

ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆండ్రీ రస్సెల్ 43.89 సగటుతో స్కోర్ చేశాడు. ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆండ్రీ రస్సెల్ నాలుగుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇది ఏ జట్టుపైనా అత్యధికం. అందుకే ఫాఫ్ డుప్లెసిస్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆండ్రీ రస్సెల్‌ కోసం ప్రత్యేకమైన వ్యూహాలు రచించాలి.

IPL 2023 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ షెడ్యూల్

1 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి (ఏడు పరుగులతో పంజాబ్ చేతిలో ఓటమి)

6 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (నేటి మ్యాచ్)

9 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

14 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

16 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై

20 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

23 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

26 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

29 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

4 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్

8 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

11 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

14 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై

20 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్‌జెయింట్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

Published at : 06 Apr 2023 06:50 PM (IST) Tags: Kolkata Knight Riders IPL 2023 Andre Russell

సంబంధిత కథనాలు

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!

IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!

Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు - ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!

Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు - ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!