RCB vs DC WPL 2023: ఆర్సీబీ vs డీసీ పోరు - రాత్రి 7:30 గంటలకు కాదు! లైవ్ స్ట్రీమింగ్ ఇందులో ఫ్రీ!
RCB vs DC WPL 2023 Live Streaming: మహిళల ప్రీమియర్ లీగులో నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి.
RCB vs DC WPL 2023 Live Streaming: మహిళల ప్రీమియర్ లీగులో నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ముంబయిలోని బ్రబౌర్న్ మైదానం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ ఎన్నింటికి మొదలవుతుంది. లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్ట్ వివరాలు మీకోసం!
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు?
మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్పోర్ట్స్-18లోనే జరగనుంది. ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయితే జియో సినిమా యాప్‌లో చూడవచ్చు. ఆదివారం డబల్ హెడర్ మ్యాచులు ఉన్నాయి. ఆర్సీబీ, డీసీ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.
Ready to paint the country RED! 🎨🔴
— Royal Challengers Bangalore (@RCBTweets) March 5, 2023
Get in, girls! 🙌#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 pic.twitter.com/6j6nkaruTK
దిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా)
షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, మారిజాన్ కాప్, లారా హ్యారిస్, జైసా అక్తర్, తానియా భాటియా, జెస్ జొనాసెన్, రాధా యాదవ్, శిఖా పాండే, టారా నోరిస్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు (అంచనా)
స్మృతి మంధాన, దిశా కసత్, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, డేన్ వాన్ నీకెర్గ్, రిచా ఘోష్, కోమల్ జన్‌జాడ్ / ఆశా శోభన, ప్రీతి బోస్, మేఘన్ షూట్, రేణుకా సింగ్, కనికా అహుజా / శ్రేయాంక పాటిల్
WPL వివరాలు
మొదటి సీజన్‌లో మొత్తం 20 లీగ్ మ్యాచ్‌లు మరియు రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇవి 23 రోజుల వ్యవధిలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం నాలుగు డబుల్ హెడర్‌లు ఉండనున్నాయి. అంటే ఒక్కరోజులో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. డబుల్ హెడర్ రోజున మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతుంది. అదే సమయంలో, రెండో మ్యాచ్ సాయంత్రం 7:30కు ప్రారంభం కానుంది.
OUR FIRST-EVER #TATAWPL MATCHDAY 💥
— Delhi Capitals (@DelhiCapitals) March 5, 2023
O Dilli re, Tu Roar Macha! #YehHaiNayiDilli #CapitalsUniverse #RCBvDC @Joypersonalcare pic.twitter.com/JZNeIhNau6
స్టార్ ప్లేయర్ల సవాల్
స్మృతి మంధాన vs జెమీమా రోడ్రిగ్స్. ఎలిస్ పెర్రీ vs మెగ్ లానింగ్. డేన్ వాన్ నీకెర్క్ vs మారిజానె కాప్. క్రికెటర్ల పేర్లు చదువుతుంటూనే కిక్కెక్కుతోంది కదూ! మరి ఫుల్లుగా ప్యాకైన బ్రబౌర్న్ స్టేడియంలో వీరు పోటీ పడుతుంటే ఎంత మజాగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు వీరంతా అభిమానులను అలరించనున్నారు. బెంగళూరు, దిల్లీ తమ మూల సూత్రాన్నే ఇక్కడా పాటిస్తున్నాయి. మంధాన, పెర్రీ, నీకెర్గ్ వంటి ప్రపంచ స్టార్లను ఆర్సీబీ తీసుకుంటే షెఫాలీ, జెమీమా, రాధా యాధవ్ వంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఇండియన్స్‌ను డీసీ పట్టేసింది.