అన్వేషించండి

IPL 2024: పంత్‌ లేకుండా బెంగళూరును ఢిల్లీ ఆపుతుందా?

IPL 2024, RCB vs DC : ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై భారీ జరిమానాతోపాటు ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ను విధించడంజట్టుకు భారీ షాక్‌ తగిలింది.

RCB vs DC   Preview and Prediction: ఐపీఎల్‌( IPL) నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో ఢిల్లీ క్యాపిటల్స్(DC) తలపడనుంది. అయితే ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై భారీ జరిమానాతోపాటు ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ను విధించడం ఆ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పంత్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ జట్టు సవాల్‌ చేసినా ఫలితం లేకపోయింది. పంత్‌ ఈమ్యాచ్‌కు దూరం కావడంతో నేడు జరిగే కీలక పోరుకు రిషభ్‌ పంత్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. పంత్‌ లేకపోవడం... బెంగళూరుకు తప్పకుండా అడ్వాంటేజ్‌ కానుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి మంచి టచ్‌లో కనిపిస్తున్న బెంగళూరును... పంత్‌లేని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎంతవరకు అడ్డుకోగలదో చూడాలి. 

ఆశలు సజీవంగా ఉండాలంటే..?
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రస్తుతం 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. చివరి నాలుగు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించిన బెంగళూరు... ప్లే ఆఫ్‌కు చేరే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో బెంగళూరు ఆత్మవిశ్వాసం పెరిగింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో బెంగళూరు బ్యాటంగ్‌ ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. ఈ ఐపీఎల్‌లో 634 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లితో పాటు, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్‌లతో బెంగళూరు బ్యాటింగ్‌ చాలా బలంగా కనిపిస్తోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో బెంగళూరు బౌలర్లు పర్వాలేదనిపిస్తున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో తేలిపోయిన బెంగళూరు బౌలర్లు... గత నాలుగు మ్యాచుల్లో మాత్రం రాణిస్తున్నారు. మహ్మద్ సిరాజ్, యష్ దయాల్ , స్పిన్నర్ స్వప్నిల్ సింగ్... బెంగళూరు బౌలింగ్‌ దళాన్ని నడిపిస్తున్నారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 9.4, దయాల్ 9 ఎకానమీతో పరుగులు ఇచ్చారు. ఈ సీజన్‌లో మొదటిసారిగా వీరిద్దరూ 10 కంటే తక్కువ సగటుతో పరుగులు ఇచ్చారు. 
 
మెక్‌గర్క్ నిలిస్తేనే...
ఈ సీజన్‌లో మెరుపురు మెరిపిస్తున్న ఢిల్లీ ఓపెనర్‌ మెక్‌గర్క్‌ పవర్‌ ప్లే వరకూ క్రీజులో నిలిచినా బెంగళూరు బౌలర్లకు తిప్పలు తప్పవు. మెక్‌గర్క్ 235.87 స్ట్రైక్ రేట్‌తో ఏడు మ్యాచ్‌ల్లో 309 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్‌ల్లో 135 స్ట్రైక్ రేట్‌తో 167 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ కూడా 157 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. పంత్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి టచ్‌లో ఉన్నారు. అయితే పంత్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఢిల్లీని దెబ్బ తీసింది. బౌలింగ్ విభాగంలో మాత్రం బెంగళూరు కంటే ఢిల్లీ కాస్త బలంగా ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నారు. పేసర్లు ఖలీల్ అహ్మద్  14 వికెట్లు, ముఖేష్ కుమార్ 15 వికెట్లతో పర్వాలేదనిపిస్తున్నారు.
 
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్ ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
 
ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్,  సుమిత్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, లిజాద్ విలియమ్స్, డేవిడ్ వార్నర్, ఝే రిచర్డ్‌సన్, అన్రిచ్ నార్ట్జే, యష్ ధుల్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, స్వస్తిక్ చికారా.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Hardik Pandya : తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
Tamil Nadu Crime News: తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
Embed widget