అన్వేషించండి

RCB IPL victory 2026: ఆర్సీబీ 'రాయల్‌' విక్టరీతో కొత్త బాసులకు కాసుల పంట! అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!

వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్ ముద్దాడిన RCB, కొత్త యజమానులకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును 14800 కోట్లకుపైగానే పెట్టి కొనుగోలు చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.
  • కొత్త యజమానులు 1.78 బిలియన్ డాలర్లకు జట్టును కొనుగోలు చేశారు.
  • విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ జట్టు బ్రాండ్‌పై ప్రభావం చూపవచ్చు.
  • ఐపీఎల్‌ మార్కెట్‌లో ఇటీవల జట్ల విలువలు విపరీతంగా పెరిగాయి.

RCB IPL victory 2026: క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు. అవి వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు. దీనికి తాజా నిదర్శనం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB). వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, తన కొత్త యజమానులకు ఆరంభంలోనే అద్భుతమైన బహుమతి అందించింది. బిలియన్ డాలర్ల డీల్‌తో జట్టును మార్చి నెలలోనే చేజిక్కించుకున్న కొత్త కన్సార్టియంకు ఈ విజయం ఎలాంటి లాభాలు తెచ్చిపెట్టోబోతోంది? అసలు ఈ డీల్‌ వెనుక ఉన్న వ్యూహాలేంటి? అనే అంశాలను డీకోడ్ చేద్దాం. 

దుమ్మురేపిన ఆర్సీబీ

మే 31 అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌ పోరులో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్‌ గెలిచిన జట్టు కేవలం చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సరసన బెంగళూరు చేరింది. ఈ విజయం జట్టు పట్ల అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేసింది. 

మూడు నెలల్లోనే జాక్‌పాట్

మార్చి చివరి వారంలో ఆర్సీబీ యాజమాన్యం చేతులు మారింది. లండన్ కేంద్రంగా పని చేసే లిక్కర్‌ కింగ్‌ డీయోజియో నుంచి ఈ జట్టును ఒక కన్సార్టియం కొనుగోలు చేసింది. దీనికి ఆదిత్య బిర్లా గ్రూప్ నాయకత్వం వహించగా, ఇందులో టైమ్స్ ఆఫ్‌ ఇండియా గ్రూప్, బోల్డ్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ భాగస్వాములుగా ఉన్నాయి. 1.78 బిలియన్ డాల్లు అంటే 14800 కోట్ల రూపాయలతో డీల్‌ను క్లోజ్ చేశారు. ఈ ఒప్పందం జరిగిన తక్కువ కాలంలోనే జట్టు టైటిల్ గెలవడం, కొత్త యజమానులకు బ్రాండింగ్ పరంగా పెద్ద ఊరట ఇచ్చింది. 

ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1 కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
2 ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
3 రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
4 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే
5 ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్

ప్రపంచవ్యాప్తంగా తనకు ఉన్న అప్పులను తగ్గించుకోవాలనే వ్యూహంతో డియోజియో ఆర్సీబీని అమ్మేసింది. జట్టు నంబర్‌ 1 స్థానంలో ఉన్నప్పుడే, మంచి ధర వస్తున్న సమయంలో విక్రయించం ద్వారా తమ బ్యాలెన్స్ షీట్‌ను ఆ సంస్థ అప్‌డేట్ చేసుకుంది. ఐపీఎల్‌నే అత్యంత ఉత్సాహవంతులైన జట్లలో ఒకటి కావడంతో  ఆర్సీబీకి మంచి ధర పలికింది. 

ఆర్సీబీ పేరు మారుతుందా? 

జట్టు పేరులోని రాయల్ ఛాలెంజ్ అనేది నిజానికి యునైటెడ్‌ స్పిరిట్స్‌కి చెందిన ఒక మద్యం బ్రాండ్. అయితే కొత్త యజమానులు అదే పేరు కొనసాగించే అవకాశం ఉంది. ఆర్సీబీ అనేది ఇప్పుడు ఒక బ్రాండ్‌పేరు మాత్రమే కాదు. అది ఒక జెనరిక్‌ పేరుగా మారిపోయింది. లోగోలో చిన్నపాటి మార్పులు చేసినా, రాయల్ ఛాలెంజర్స్‌ ఏ విషయాన్ని కూడా మార్చకపోవడమే  లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. 

సవాల్‌గా మారిన విరాట్ 

ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ కోహ్లీ తప్పుకుంటే, జట్టు బ్రాండ్ వాల్యుపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే కొత్త యజమానులు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునే భారీ పెట్టుబడి పెట్టి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఐపీఎల్ మార్కెట్‌లో పెరిగిన పోటీ 

కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు. ఇటీవల కాలంలో ఐపీఎల్ జట్ల విలువ విపరీతంగా పెరిగాయి. గుజరాత్‌ టైటాన్స్‌ వాటాను అహ్మదాబాద్‌కు చెందిన టోరెంట్‌ గ్రూప్‌ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ తన ఫ్యామిలీ ఆఫీస్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ లోని 75 శాతం వాటాను కొనుగోలు చేశారు. 

ఆర్సీబీ సాధించిన ఈ విజయం కేవలం ఒక ట్రోఫీకే పరిమితం కాలేదు. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంకు మార్కెట్‌లో తిరుగులేని గుర్తింపును, ఆర్థికంగా బలమైన పునాదిని వేసింది. 

Frequently Asked Questions

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త యజమానులకు జట్టు విజయం ఎలాంటి లాభాలను తెచ్చిపెట్టింది?

ఈ విజయం కొత్త యజమానులకు బ్రాండింగ్ పరంగా ఊరటనిచ్చింది. ఇది మార్కెట్లో వారికి తిరుగులేని గుర్తింపును, ఆర్థికంగా బలమైన పునాదిని వేసింది.

RCB జట్టును ఎవరు, ఎంతకు కొనుగోలు చేశారు?

లండన్ కేంద్రంగా పనిచేసే డీయోజియో నుంచి ఒక కన్సార్టియం ఈ జట్టును కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నాయకత్వంలోని ఈ ఒప్పందం 1.78 బిలియన్ డాలర్లకు (14800 కోట్ల రూపాయలు) క్లోజ్ అయింది.

RCB జట్టు పేరు మారుతుందా?

కొత్త యజమానులు అదే పేరు కొనసాగించే అవకాశం ఉంది. 'RCB' ఇప్పుడు ఒక బ్రాండ్ పేరుగా మారింది, కాబట్టి పేరు మార్చకపోవడమే లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ RCB బ్రాండ్ విలువపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

కోహ్లీ తప్పుకుంటే జట్టు బ్రాండ్ వాల్యూపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే, కొత్త యజమానులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే పెట్టుబడి పెట్టి ఉండవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget