IPL 2025 CSK VS RR Result Updates : ఎట్టకేలకు రాయల్స్ సక్సెస్ ఫుల్ ఛేజింగ్.. చెన్నై పై థ్రిల్లింగ్ విక్టరీ.. పదో స్థానంతో సీజన్ ను ముగించనున్న సీఎస్కే
ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి ఔటయిన ఇరుజట్లు చెన్నై, రాయల్స్ మధ్య సోమవారం ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరికి ఒత్తిడిని అధిగమించి, ఎట్టకేలకు రాయల్స్.. విజయవంతంగా ఛేజింగ్ ను పూర్తి చేసింది.

IPL 2025 RR Successful Chasing: ఛేజింగ్ లో ఎట్టకేలకు తన చోకింగ్ గుణాన్ని రాజస్థాన్ రాయల్స్ విడనాడింది. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్లతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ ను తొమ్మిదో స్థానంతో ముగించింది. ఇక చెన్నై చేతిలో మరో మ్యాచ్ ఉన్నప్పటికీ, రన్ రేట్ చాలా ఘోరంగా ఉండటంతో మరో మ్యాచ్ గెలిచినా, పదో స్థానంలో దాదాపు నిలవనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే (20 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్సర్) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆకాశ్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ మూడేసి వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేజింగ్ లో రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. కుర్ర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 57, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి.
AYUSH MHATRE - THE FUTURE STAR OF CHENNAI SUPER KINGS & INDIA.!! pic.twitter.com/jmNpo4iTDh
— MANU. (@IMManu_18) May 20, 2025
బ్యాటర్ల వైఫల్యం..
షరా మాములుగానే ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటింగ్ వైఫల్యం కొన సాగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 12 పరుగులకే డేవన్ కాన్వే (10), ఊర్వీ పటేల్ డకౌట్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆయుష్ మాత్రే దూకుడుగా ఆడి, స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అతనికి అశ్విన్ (13) మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 56 పరుగులు జోడించిన తర్వాత చెన్నై ఇన్నింగ్స్ గాడి తప్పింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మధ్యలో డెవాల్డ్ బ్రివిస్ (42), శివమ్ దూబే (39) కాస్త ఫర్వాలేదనిపించారు. చివర్లో వేగంగా పరుగులు సాధించడంలో చెన్నై విఫలమైంది.
No fear and pressure 🙅
— IndianPremierLeague (@IPL) May 20, 2025
Just pure finesse 😎
Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0
ఓపెనర్లు జోరు..
ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (36), వైభవ్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి, 22 బంతుల్లోనే 37 పరుగులు జోడించారు. ఆ తర్వాత జైస్వాల్ ఔటైనా వైభవ్ మెచ్యురిటీతో ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (41) తో కీలక పరుగులు జోడించాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడి, రెండో వికెట్ కు 98 పరుగులు జోడించి, మ్యాచ్ ను రాజస్థాన్ చేతుల్లోకి తీసుకొచ్చారు. ఈక్రమంలో 27 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకే ఓవర్లో వైభవ్, సంజూ ఔట్ కావడం, రియాన్ పరాగ్ (3) విఫలం కావడంతో రాయల్స్ మళ్లీ చోక్ చేస్తుందనిపించింది. అయితే ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 31 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), షిమ్రాన్ హిట్ మెయర్ (12 నాటౌట్) వేగంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. తాజా ఫలితంతో ఈ సీజన్ ను రాయల్స్ తొమ్మిదో స్థానంతో ముగించగా, చెన్నై తమ చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థానమైన పదోస్థానంతో ఈ సీజన్ ను ముగించింది.




















