అన్వేషించండి

IPL 2024: ఆసుపత్రిలో అమ్మ ఉందన్న బాధ తట్టుకొని జట్టును ఫైనల్‌కు చేర్చిన రహ్మానుల్లా గుర్బాజ్, కేకేఆర్ ఆటగాడి ఎమోషనల్‌ ఇన్నింగ్‌

Rahmanullah Gurbaz: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని వదిలి ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు వచ్చినట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ తెలిపాడు.

Rahmanullah Gurbaz emotional : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై కలకత్తా (kkr ) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ గా దిగిన రహ్మానుల్లా గుర్బాజ్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. తొలిసారిగా ఆడినప్పటికీ కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు సునీల్ నరైన్ తో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. నిజానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. కానీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఓపెనర్ గా కూడా ఉండటంతో రహ్మానుల్లా గుర్బాజ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. వీటన్నింటి మధ్య, రెహ్మానుల్లా గుర్బాజ్ తల్లి అనారోగ్యం కారణంగా ఐపిఎల్‌ను సగంలోనే వదిలి ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వెళ్ళిపోయాడు.

అయితే సరిగ్గా ప్లే ఆఫ్ మ్యాచ్‌కు ముందు, ఫిల్ సాల్ట్ IPL నుంచి నిష్క్రమించాడు.  టీ20 ప్రపంచకప్‌ కంటే ముందు ఇంగ్లిష్‌ జట్టు పాకిస్థాన్‌తో ఓ సిరీస్‌లో తలపడనుంది. దీని కోసమే ఈ విధ్వంసకర ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్‌ సాల్ట్‌ మధ్యలోనే ఐపీఎల్ ను వదిలిపెట్టి స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో అవకాశం మరోసారి గుర్బాజ్‌ తలుపు తట్టింది.

 

అయితే అటు కుటుంబం , ఇటు KKR కుటుంబం రెండూ తనకు ముఖ్యమైనవే అని భావించిన గుర్బాజ్‌ అనారోగ్యంతో ఉన్న తన తల్లి అనుమతితో భారత్ కి వచ్చాడు.  వ్యక్తిగత, వృత్తిపరమైన కట్టుబాట్లను బ్యాలెన్స్ చేయడం అనే  సవాలును అంగీకరించాడు,   తల్లి ఆశీర్వాదం తీసుకొని,  IPL 2024లో  కొనసాగటానికి వచ్చానని చెబుతూ భావోద్వేగాయానికి గురయ్యాడు. ఇంకా, తన తల్లి ఇంకా ఆసుపత్రిలో  ఉన్నారని, తాను ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతున్నానని వెల్లడించాడు. ఒక  క్రికెటర్‌గా అవకాశం వచ్చినప్పుడు జట్టుకోసం పోరాడటానికి తనను తాను మానసికంగా  సిద్ధం చేసుకున్నానని  చెప్పాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ లీగ్ దశలో దుమ్మురేపి టాప్‍లో నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్.. ప్లేఆఫ్స్‌లోనూ దూకుడు కొనసాగించి రాయల్ గా ఫైనల్లో  అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍పై కోల్‍కతా విజయం సాధించింది. 38 బంతులు మిగిల్చి మరీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది శ్రేయస్ అయ్యర్ సేన. దీంతో ఐపీఎల్‍లో నాలుగోసారి ఫైనల్ చేరింది కేకేఆర్.

160 పరుగుల లక్ష్యాన్ని కోల్‍కతా నైట్‍రైడర్స్  అలవోకగా ఛేదించింది. 13.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 164 పరుగులు చేసి కోల్‍కతా గెలిచింది. కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్  ఇద్దరు అర్ధ శతకాలతో అజేయంగా నిలిచారు.  అంతకు ముందు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ , సునీల్ నరైన్ కూడా  పర్వాలేదనిపించారు.  మొత్తానికి సునామీ హిట్టింగ్‍తో అదరగొట్టే ఆటతో కోల్‌కతా ఫైనల్ లోకి దూసుకుపోయింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget