Priyansh Arya Century: ఐపీఎల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్.. డీపీఎల్ ద్వారా వెలుగులోకి.. ప్రియాంశ్ నేపథ్యమేంటో తెలుసా..?
CSK VS PBKS: ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ గా ప్రియాంశ్ ఆర్య నిలిచాడు. చెన్నైపై ధనాధన్ ఆటతీరుతో సత్తా చాటాడు. డీపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన మట్టిలో మాణిక్యం.

IPL 2025 CSK VS PBKS Live Updates: పంజాబ్ యువ సంచలనం ప్రియాంశ్ ఆర్య ఒక్కసారిగా సంచలనం రేకెత్తించాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగిన ప్రియాంశ్.. చెన్నై సూపర్ కింగ్స్ పై కేవలం 39 బంతుల్లోనే మెగాటోర్నీలో సెంచరీ చేసి, అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. 2010లో యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ప్రియాంశ్ ఆర్యను గతేడాది వేలంలో రూ.3.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. స్ట్రెయిట్ గా ఈ ఏడాది నుంచి అతడిని ఓపెనర్ గా బరిలోకి దించుతోంది. తొలి మ్యాచ్ లోనే 47 పరుగులు చేసిన ఆర్య.. ఇక చెన్నైపై మాత్రం తాండవం ఆడాడు. అందరూ ఆడటానికి ఇబ్బందిపడే శ్రీలంక పేసర్ మతీషా పత్తిరాణాను అలవోకా ఎదుర్కొని, 13వ ఓవర్లో 22 పరుగులు పిండుకుని సెంచరీ సాధించాడు. దీంతో అందరి ఫోకస్ అతనిపై నిలిచింది.
I.C.Y.M.I
— IndianPremierLeague (@IPL) April 8, 2025
𝗣𝗼𝘄𝗲𝗿💪. 𝗣𝗿𝗲𝗰𝗶𝘀𝗶𝗼𝗻👌. 𝗣𝗮𝗻𝗮𝗰𝗵𝗲💥.
Priyansh Arya graced the home crowd with his effortless fireworks 🎆
Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/7JBcdhok58
డీపీఎల్ తో వెలుగు లోకి..
ఇక ఢిల్లీకి చెందిన ప్రియాంశ్.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ టోర్నీలో 608 పరుగులతో టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ తరపున ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో ఆడి లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అదే టోర్నీలో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి సత్తా చాటాడు. అప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో పంజాబ్ గతేడాది వేలంలో కాస్త భారీ ధరకే అతడిని కొనుగోలు చేసింది.
FASTEST IPL HUNDRED FOR AN INDIAN IN IPL (By Balls)
— Indian Sports Fans. Fan Curated & Original (@IndianSportFan) April 8, 2025
37 Balls: Yusuf Pathan vs MI, 2010
39 Balls: Priyansh Arya vs CSK, 2025
45 Balls: Mayank Agarwal vs RR, 2020
45 Balls: Ishan Kishan vs RR, 2025#IndianSportsFans #CricketPredicta #IPL2025 #ViratKohli #IPLOnCricketPredicta #CSK pic.twitter.com/Id6g50iHH7
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో..
ఇక దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగుల వరద పారించిన అనుభవం ప్రియాంశ్ కు ఉంది. 2023-24 సీజన్లో ఈ టోర్నీలో ఢిల్ఈల తరపున బరిలోకి దిగిన ప్రియాంశ్.. 222 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సగటు 31.71 ఉండగా, 166.91 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. అయిత 2024 సీజన్ కు సంబంధించి వేలంలో అతను పేరు నమోదు చేసుకోగా, అనూహ్యంగా ఆ వేలంలో అమ్ముడు పోలేదు. ఇక గతేడాది మెగా వేలంలో మాత్రం పంజాబ్ అతడిని పిక్ చేసింది. ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన ప్రియాంశ్.. 158 పరుగులు చేశాడు. అతని సగటు 39.50 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 210కిపైగా ఉండటం విశేషం. ఏదేమైనా ఈసారి సీజన్ లో మరో యువ ప్లేయర్ వెలుగులోకి వచ్చాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా ఇన్నింగ్స్ తో పంజాబ్ జట్టులో తన చోటును స్థిర పరుచుకున్నాడని భావిస్తున్నారు.




















