అన్వేషించండి
Advertisement
Pakistan Cricket Board: పాక్ క్రికెట్‌లో మరో సంక్షోభం, సెలక్షన్ కమిటీ రద్దు
Pakistan Cricket Board: మరికొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది.
Pakistan reorganises selection committee ahead of T20 World Cup: మరికొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్(T20 World Cup) ఆరంభం కానున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుతం కొనసాగతున్న సెలెక్షన్ కమిటీని రద్దు చేస్తున్నామని.... కొత్త కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్‌తో సమావేశమైన తర్వాత నఖ్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమధ్యే పీసీబీ ఏడుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మాజీ ఆటగాళ్లు అబ్దుల్ రజాక్, అసద్ షఫీక్, మహమ్మద్ యూసుఫ్, వాహబ్ రియాజ్, కెప్టెన్, హెడ్‌కోచ్, డేటా అనలిస్ట్‌లకు చోటు దక్కింది. అయితే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లో పాక్ జట్టు చెత్త ఆటతో నిరాశపరిచింది. దాంతో, సెలక్షన్ కమిటీపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ వేటు వేశారు.
రెండేళ్లలోనే పాక్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు
గడిచిన రెండేళ్ల కాలంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు మారారు. రమిజ్ రాజా, నజం సేథీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వైదొలగగా... తాజాగా అష్రఫ్ కూడా పదవికి రాజీనామా చేశాడు. అనంతరం పాకిస్థాన్ జట్టు(Pakistan Cricket team)కు సయిద్ మోహ్సిన్ రజా నఖ్వీ(Mohsin Naqvi) పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. అయితే ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. అందుకే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగారాణించడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి విమర్శలు వేళ ఇక ఆటగాళ్ల ఫిట్నెస్ను మరింత మెరుగుపరిచే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శన చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమితో పాక్ కెప్టెన్సీ పదవికి బాబార్ ఆజమ్ రాజీనామా చేసినప్పుడు మొదలైన రాజీనామాల పర్వం కొనసాగింది. ముందుగా ప్రపంచకప్‌లో పాక్ క్రికెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మికీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుట్టిక్ రాజీనామా చేశారు. తరువాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు( Pakistan Cricket board) చైర్మన్ జకా అష్రఫ్(Zaka Ashraf) తన పదవికి రాజీనామా చేశారు. పదవి చేపట్టి ఏడాది కాకముందే పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు.
ఆర్మీ ట్రైనింగ్....
విదేశీ ఆటగాళ్ల తరహాలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోవడం.. తరుచూ గాయాల బారిన పడుతుండటం.. సిక్సర్లు కొట్టలేకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లలా ఫిట్‌గా ఉండాలంటే పాకిస్థాన్ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ అవసరమని పీసీబీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు తెలియజేసినట్లు పీసీబీ చైర్మన్ మోహ్‌సిన్ నక్వీ తెలిపారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ సూపర్ లీగ్ ను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ లీగ్ ముగిసిన తర్వాత జాతీయ జట్టు సభ్యులందరికీ కూడా ఏకంగా సైన్యంలో శిక్షణ ఇప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది .
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion