IPL 2024: తొలి బ్యాటింగ్ పంజాబ్‌దే, ధావన్ స్థానంలో కెప్టెన్‌గా కరణ్
PBKS vs RR: ఐపిఎల్ 2024లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు శిఖర్ ధావన్‌కు బదులుగా సామ్‌కరన్ నాయకత్వం వహించనున్నాడు
PBKS vs RR IPL 2024 Rajasthan Royals opt to bowl : ఐపీఎల్(IPL) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్(RR)... పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్‌లో ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌కు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు బదులు శామ్ కరణ్ టాస్‌కు వచ్చాడు. ధావన్‌కు గాయమైందా.. లేక ఏదైనా కారణంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడా అన్నది తెలియరాలేదు. రాజస్థాన్... అస్థిరంగా ఉన్న పంజాబ్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ రాయల్స్ పట్టుదలగా ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్... ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌తో తలపడనుంది. పంజాబ్‌పై అయిదో విజయం నమోదు చేసి.. అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది.రాజస్థాన్ తుది జట్టులో బట్లర్, అశ్విన్ స్థానంలో రొవ్‌మన్ పొవెల్, తనుష్ కొటియాన్ వచ్చారు.
విజయాల బాట పట్టాలని..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చివరి బంతి వరకూ పోరాడినా విజయం దక్కలేదు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో గుజరాత్ స్టార్ రషీద్‌ఖాన్ అద్భుత బౌండరీతో గిల్ సేనకు విజయాన్ని అందించాడు. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి బరిలోకి దిగాలని రాజస్థాన్ చూస్తోంది. పంజాబ్‌తో జరుగాల్సిన మ్యాచ్‌లో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సాధికార విజయం సాధించాలని రాజస్థాన్ భావిస్తోంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్... చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి గుజరాత్ చేతిలో ఓడింది. ట్రెంట్ బౌల్డ్‌కు పూర్తి కోటా బౌలింగ్ ఇవ్వకుండా రాజస్థాన్ వ్యూహాత్మక తప్పిదం చేసింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయకూడదని సంజు శాంసన్ భావిస్తున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ రెండు ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు. బౌల్ట్‌కు బౌలింగ్ ఇస్తే మ్యాచ్ ఫలితం ఇంకోలా ఉండేదన్న విశ్లేషణలున్నాయి. ఈ వ్యూహాత్మక తప్పిదాలు దాటేస్తే పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు తేలికే.
పంజాబ్ గాడిన పడేనా..?
శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ ఇప్పటివరకూ అయిదు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ వారికి కీలకంగా మారనుంది. పంజాబ్ బ్యాటింగ్ వారిని ఆందోళన పరుస్తోంది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించడం లేదు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 5 మ్యాచ్‌ల్లో 81 పరుగులు, జితేష్ శర్మ 5 మ్యాచ్‌ల్లో 77 పరుగులు చేసి విఫలమవుతున్నారు. వీరు గాడిన పడకపోతే పంజాబ్‌కు కష్టాలు తప్పవు. శామ్ కరణ్ బౌలింగ్‌లో రాణిస్తున్నా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. అయిదు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కరణ్.. బ్యాటింగ్‌లో మాత్రం 63 పరుగులు మాత్రమే చేశాడు. గాయపడిన లియామ్ లివింగ్‌స్టోన్ జట్టులో లేకపోవడం పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌ను బలహీన పరిచింది. పంజాబ్ బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నా బ్యాటర్లు జూలు విదిలించాల్సి ఉంది. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. రాయల్స్ బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉన్న వేళ రబాడ దళం వీరిని ఎలా అడ్డుకుంటుందో చూడాలి.