![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PBKS Vs GT: టాస్ గుజరాత్‌దే - బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా!
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
![PBKS Vs GT: టాస్ గుజరాత్‌దే - బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా! PBKS Vs GT: Gujarat Titans Won the Toss Chose to Bowl Against Punjab Kings PBKS Vs GT: టాస్ గుజరాత్‌దే - బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/ec762d23e232763e87c36346046fddff1681391462093224_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజీన్ 18వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట పంజాబ్ బ్యాటింగ్‌కు దిగనుంది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
సికందర్ రజా, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, రాహుల్ చాహర్, అథర్వ తైదే, గుర్నూర్ బ్రార్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
విజయ్ శంకర్, శివమ్ మావి, జయంత్ యాదవ్, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్
ఐపీఎల్ 2023లో నేడు పంజాబ్ కింగ్స్ (Punjab Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఢీకొంటున్నాయి. విన్నింగ్స్ మూమెంటమ్ కంటిన్యూ చేయాలని గబ్బర్ సేన పట్టుదలగా ఉంది. లోపాలు సరిదిద్దుకోవాలని భావిస్తోంది. కోల్‌కతా చేతిలో అవమానకర ఓటమి నుంచి త్వరగా బయటపడాలని పాండ్య సేన ఉవ్విళ్లూరుతుంది. మరి మొహాలిలో తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంప్టాక్ ప్లేయర్స్ వ్యూహం ఏంటి?
మొహాలి పిచ్ పెద్ద మైదానం! బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కేఎల్ రాహుల్ ఇక్కడ పరుగుల వరద పారించాడు. డ్యూ ఫ్యాక్టర్ తక్కువే ఉంటుంది. కఠినమైన లైన్ అండ్ లెంగ్తుల్లో బంతులేస్తే బౌలర్లు వికెట్లు తీయొచ్చు. బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటర్ ఫ్రెండ్లీ అనొచ్చు.
పంజాబ్ కింగ్స్ చివరి మ్యాచులో ఒక ప్రయోగం చేసింది. సికిందర్ రజా లేకుండా రెండో ఇన్నింగ్సులో రబాడను ఇంప్టాక్ ప్లేయర్‌గా ఆడించాలని చూసింది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో రజా రావాల్సి వచ్చింది. ఇప్పుడు లివింగ్‌స్టన్ అందుబాటులో ఉన్నాడు కాబట్టి రాబాడకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
హార్దిక్ పాండ్య అందుబాటులో రావడంతో అభినవ్ మనోహర్‌కు తుది జట్టులో చోటుండదు. యశ్ దయాల్ బౌలింగ్‌లో రింకూ సింగ్ ఐదు సిక్సర్లు బాదేశాడు. మరిప్పుడు యశ్‌కు అండగా ఉంటారో లేదో చూడాలి. ఆర్.సాయికిషోర్‌ను బరిలోకి దించేందుకు ఇదే సరైన సమయం. జీటీ తొలుత బ్యాటింగ్ చేస్తే సాయి సుదర్శన్ జట్టులో ఉంటాడు. ఫీల్డింగైతే జోష్ లిటిల్ ఉంటాడు. పరిస్థితులను బట్టి వీరే ఇంపాక్ట్ ప్లేయర్లు అవుతారు.
🚨 Team Updates 🚨
— IndianPremierLeague (@IPL) April 13, 2023
A look at the two sides for the #PBKSvGT contest👌👌
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL pic.twitter.com/44i7o1bOaa
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to bowl first against @PunjabKingsIPL.
— IndianPremierLeague (@IPL) April 13, 2023
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jM5STYICl6
Captain @SDhawan25 getting into the groove 😎#TATAIPL | #PBKSvGT pic.twitter.com/2r86e1EKvM
— IndianPremierLeague (@IPL) April 13, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)