News
News
వీడియోలు ఆటలు
X

PBKS Vs DC: పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డ రౌసో - భారీ స్కోరు సాధించిన ఢిల్లీ!

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయానికి 214 పరుగులు చేయాలి.

FOLLOW US: 
Share:

Punjab Kings vs Delhi Capitals: ఐపీఎల్‌ 2023 సీజన్ 62వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రిలీ రౌసో (82 నాటౌట్: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పృథ్వీ షా (54: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఫాంలోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ విజయానికి 120 బంతుల్లో 214 పరుగులు కావాల్సి ఉంది. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ తాను ఇంటి బాట పడుతూ పంజాబ్‌ను కూడా తీసుకెళ్లేలా ఉంది. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (46: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), పృథ్వీ షా (54: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) శుభారంభం అందించారు. వీరు వేగంగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 94 పరుగులు జోడించిన అనంతరం డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసి శామ్ కరన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

ఆ తర్వాత వచ్చిన రిలీ రౌసో (82 నాటౌట్: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మరింత విధ్వంసకరంగా ఆడాడు. వచ్చీ రాగానే బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. పృథ్వీ షాతో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. సరిగ్గా 15వ ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా అవుటయ్యాడు.

ఫిల్ సాల్ట్ (26 నాటౌట్: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వచ్చాక పంజాబ్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. తర్వాతి మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ చివరి రెండు ఓవర్లలో ఫిల్ సాల్ట్, రిలీ రౌసో విధ్వంసం సృష్టించేశారు. నాథన్ ఎల్లిస్ 19వ ఓవర్లో ఫిల్ సాల్ట్ రెండు సిక్సర్లు, ఒక బౌండరీ సహా 18 పరుగులు రాబట్టాడు. ఇంక హర్‌ప్రీత్ బ్రార్ వేసిన చివరి ఓవర్లలో రిలీ రౌసో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టగా, ఫిల్ సాల్ట్ చివరి బంతికి బౌండరీ సాధించాడు. ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఈ రెండు ఓవర్లలోనే 41 పరుగులు రావడంతో పంజాబ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. పంజాబ్ కింగ్స్ బౌలరల్లో శామ్ కరన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తన తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అధర్వ తైడే, కగిసో రబడ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆన్రిచ్ నోర్జే తిరిగి జట్టులోకి వచ్చాడు. మిషెల్ మార్ష్ గాయపడటంతో నోర్జేకు స్థానం దక్కింది

పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనూ, పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలోనూ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడిస్తే తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సికందర్ రజా, మాథ్యూ షార్ట్, రిషి ధావన్, మోహిత్ రాథీ

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, అభిషేక్ పోరెల్, రిపాల్ పటేల్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్

Published at : 17 May 2023 09:18 PM (IST) Tags: Delhi Capitals DC Punjab Kings PBKS IPL PBKS Vs DC IPL 2023 Indian Premier League 2023 IPL 2023 Match 64

సంబంధిత కథనాలు

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!