News
News
వీడియోలు ఆటలు
X

MI Vs CSK: ముంబైపై టాస్ గెలిచిన ధోని - బ్యాటింగ్ రోహిత్ సేనకే!

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

FOLLOW US: 
Share:

Mumbai Indians vs Chennai Super Kings: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే

ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
రాజవర్ధన్ హంగర్గేకర్, అంబటి రాయుడు, షేక్ రషీద్, ఆకాష్ సింగ్, సుభ్రాంశు సేనాపతి

ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్

ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
రమణదీప్ సింగ్, సందీప్ వారియర్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, నేహాల్ వధేరా

గడిచిన రెండ్రోజులుగా సోషల్ మీడియాలో  ఎక్కడ చూసినా  ఎల్ క్లాసికో గోలే. అసలు  ముంబై - చెన్నై  మ్యాచ్‌ను అభిమానులు ఎందుకు అలా పిలుచుకుంటారు. యూరోపియన్ ఫుట్‌బాల్‌లో రియల్ మాడ్రిడ్ - బార్సిలోనా టీమ్స్‌కు వీరాభిమానులు ఉన్నారు. ఈ  రెండు జట్ల  జరిగే మ్యాచ్‌లు అభిమానులను  మునివేళ్లపై  నిల్చోబెడుతాయి.  ప్రతీ మ్యాచ్ ఉత్కంఠే. ఎప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. ఐపీఎల్‌లో కూడా ముంబై - చెన్నై జట్లు  లీగ్ లోనే  మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్.  ఈ లీగ్ లో ఇదివరకు 15 సీజన్లు (ప్రస్తుతం 16వది) ముగియగా 9 టైటిల్స్‌ (ముంబై -5, చెన్నై-4)  ను  ఈ రెండు జట్లే పంచుకున్నాయి.  ఈ రెండు జట్ల  మధ్య జరిగే మ్యాచ్‌లు కూడా  ఉత్కంఠగా జరుగుతాయి. 

ఐపీఎల్‌లో  ఈ రెండు జట్ల మధ్య సమరాన్ని  ‘ఎల్ క్లాసికో’ అని అభివర్ణించింది  ముంబై ఇండియన్స్ సారథి  రోహిత్ శర్మనే. 2018లో  సీఎస్కేతో మ్యాచ్ గురించి ఏం చెబుతారు..? అని విలేకరులు అడగ్గా  రోహిత్‌తో పాటు  అప్పుడు టీమ్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న  కీరన్ పొలార్డ్‌లు  ఎల్ క్లాసికో అని అన్నారు. అప్పట్నుంచి  ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఇదే పేరు స్థిరపడిపోయింది. 

ఐపీఎల్‌లో  ముంబై - చెన్నైలు  ఇప్పటివరకు  34 సార్లు తలపడ్డాయి. ఇందులో  చెన్నై కంటే ముంబై వైపే మొగ్గు ఎక్కువగా ఉంది.   సీఎస్కే  14 మ్యాచ్‌లను గెలవగా.. ముంబై  ఏకంగా 20 సార్లు నెగ్గింది.  వీటిలో  గ్రూప్ మ్యాచ్‌లు పోగా 9 సార్లు ఇరుజట్లూ  నాకౌట్ దశలో  పోటీ పడ్డాయి.   వీటిలో నాలుగు ఫైనల్స్ కూడా ఉన్నాయి. 2010 ఐపీఎల్ ఫైనల్స్, 2012 లో ఎలమినేటర్, 2013లో ఎలిమినేటర్, ఫైనల్స్  జరిగాయి. 2014లో ఎలిమినేటర్,  2015 క్వాలిఫయర్, ఫైనల్స్ లోనూ వీటి మధ్యే పోరు జరిగింది. 2019 లో  కూడా క్వాలిఫైయర్స్, ఫైనల్స్ జరిగాయి. 

Published at : 08 Apr 2023 07:11 PM (IST) Tags: Rohit Sharma MI CSK MS Dhoni Mumbai Indians IPL IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023 MI Vs CSK IPL 2023 Match 12

సంబంధిత కథనాలు

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ