అన్వేషించండి
Advertisement
MS Dhoni: ఆడుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూశా- ఫ్యామిలీ కనిపించింది- వెంటనే బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించి వచ్చేశా: ధోనీ
MS Dhoni Cricket Retirement : క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు నుంచి కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చానన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఐపిఎల్ ముందే ఫిట్నెస్ పై దృష్టి పెట్టానని చెప్పాడు.
MS Dhoni Retirement : ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్‌లో భారతదేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ధోనీ కూడా ఒకడు. అయితే ధోనీ తీసుకొనే నిర్ణయాలు మాత్రం షాకింగ్‌గా ఉంటాయి. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ బాధ నుంచి భారత క్రికెట్ అభిమానులు నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఎంఎస్ ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. కనీసం అభిమానులకు ఫేర్ వెల్ మ్యాచ్ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా తనదైన స్టైల్లో రిటైర్మెంట్ ఇచ్చాడు.
అప్పుడు అలా ఎందుకు చేశానంటే
42 ఏళ్ళ మహీకి ఇదే చివరి ఐపీఎల్ అని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన పదేళ్ల తర్వాత MS ధోని తాను సుదీర్ఘమైన ఫార్మాట్ నుంచి వైదొలగడానికి గల కారణాలను బయటపెట్టాడు. 2014లో మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్ట్ తర్వాత ధోనీ అకస్మాత్తుగా టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు, ఇది భారత అభిమానులకు షాక్ ఇచ్చింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ధోనీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలగడానికి కారణాలు తెలిపాడు. టెస్ట్‌లకు 2015లో వీడ్కోలు పలికిన ధోని.. వన్డేల్లో మాత్రం 2019 వరకు కొనసాగాడు. ఒక పబ్లిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ, తను,కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉందని గ్రహించిన రోజున వెంటనే రిటైర్మెంట్ ప్రకటించానని చెప్పాడు.
ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నప్పుడు, చాలా కాలం పాటు భారత జట్టులో భాగమై ఉన్నప్పుడు కుటుంబంతో గడిపే సమయాన్ని ఎక్కువగా కోల్పోతామని చెప్పాడు. అందుకే 2015 వరకు, అన్ని ఫార్మాట్లలో ఆడానని, కానీ ఈ మధ్య నేను ఇంట్లోనే ఉండటం వల్ల ఐపిఎల్‌కి ముందు ఫిట్నెస్‌పై దృష్టి పెట్టాను అన్నాడు. ఒక వేళ అన్నీ ఫార్మాట్లలో ఆడేవాళ్ళు అయితే సీరీస్‌కి ముందు వచ్చే వారం రోజుల సెలవులు కుటుంబంతో గడిపి తరువాత వేరే ప్రదేశానికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన వస్తుందని .. ఇవన్నీ ఆలోచించే తాను 2015 నుంచి కుటుంబంతో ఎక్కువ సమయం గడపటానికే ఒక్కో ఆట నుంచి విరమించానని చెప్పాడు.
మంచి వ్యాపకాలే రిచార్జ్
వృధ్యాప్యం లో ఉన్న తల్లిదండ్రులు , భార్య, పిల్లలతో సమయం గడపాలి అంటే ఇదే సరైన నిర్ణయం అని తాను భావించానన్నాడు. మంచి వ్యాపకాలు మనల్ని చేసే పనులపై ఏకాగ్రత పెంచేలా చేస్తాయన్నాడు. తనకి వ్యవసాయం అన్నా, వింటేజ్ కార్లు అన్నా, మోటార్ బైక్ అన్నా ఇష్టమని, ఎంత ఒత్తిడిలో ఉన్నా గెరాజ్‌లో 2గంటలు కూర్చుంటే తను మళ్ళీ ఫ్రెష్‌గా ఫీలవుతానని చెప్పాడు. అంతే కాదు తనకి పెంపుడు జంతువులు అన్నా చాలా ఇష్టం అని చెప్పాడు.
2014లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, తరువాత . 2020 ఆగష్టు 15న పరిమిత ఓవర్లకు కూడా బై బై చెప్పాడు, అయితే ఐపీఎల్‌లో మాత్రం అదరగొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా అవుట్ అయిపోయినా సరే బాధపడటం మరచిపోయిన అభిమానులు ధోనీ ఆట కోసం ఎదురు చూశారు అంటే అర్థం అవుతుంది ధోనీ క్రేజ్ ఎంటో. అయితే ఈసారి ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటికి చేరిన విషయం తెలిసిందే.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion