News
News
వీడియోలు ఆటలు
X

MI Vs SRH: వాంఖడేలో టాస్ ముంబైదే - ప్లేఆఫ్స్ ఆశలు ఉండాలంటే గెలవాల్సిందే!

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

FOLLOW US: 
Share:

Sunrisers Hyderabad vs Mumbai Indians: ఐపీఎల్‌ 2023 సీజన్ 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మొదట బ్యాటింగ్ చేయనుంది. ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ గెలుపు వారికి చాలా ముఖ్యం.

పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలోనూ ఉన్నాయి. టోర్నీలో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ముంబైకి ఈ విజయం చాలా ముఖ్యం. నెట్ రన్‌రేట్ కూడా ముఖ్యమే కాబట్టి ముంబై భారీ తేడాతో గెలిస్తే ఇంకా మంచిది. సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. కాబట్టి గెలిచినా ఓడినా వారికి పోయేదేమీ లేదు. కానీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో చివర నిలిచే అవమానం తప్పుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్

ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్

ఐపీఎల్- 16 లో ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌లు ఆడి ద ఏడింట గెలిచి  ఆరు ఓడింది.  చేతిలో 14 పాయింట్లు నెట రన్ రేట్  (-0.128)  మైనస్ లో  ప్లేఆఫ్స్  రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తీవ్ర పోటీని ఎదుర్కుంటుంది. రోహిత్ సేన తమ గత లీగ్ మ్యాచ్ లో  లక్నో  సూపర్ జెయింట్స్‌తో విజయానికి దగ్గరగా వచ్చి ఆఖరి ఓవర్లో 11 పరుగులు  చేయలేక  గెలుపు ముందు బొక్క బోర్లా పడింది.  ఈ మ్యాచ్ గెలిచుంటే ముంబైకి ఆరామ్‌సే  ప్లేఆఫ్స్‌కు వెళ్లేది. కానీ ‘స్క్రిప్ట్’లో  అలా లేదు.

ఇక ఇప్పుడు  ముంబై.. హైదరాబాద్‌పై ఏదో ఆడామా.. గెలిచామా.. అంటే కుదరదు. వాంఖెడేలో హైదరాబాద్‌ను కనీసం  80 ప్లస్ పరుగుల తేడాతో ఓడించాలి. ఇక్కడితోనే అయిపోయిందా..? అంటే కుదరదు.  చివరి లీగ్ మ్యాచ్ లో  గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ  ఓడిపోవాలి. వర్షం పడి  ఆమ్యాచ్ రద్దైనా (అప్పుడు ఆర్సీబీ కంటే ముంబైకి   ఒక్క పాయింట్ ఎక్కువగా ఉంటుంది)  ముంబైకి సంబురమే. ఇందులో ఏ ఒక్కటి ముంబైకి అనుకూలంగా లేకపోయినా  రోహిత్ సేన.. నేటి రాత్రికి  టీవీలు కట్టేసి  బ్యాగ్‌లు సర్దుకోవడమే..!

ముంబై కథ అలా ఉంటే హైదరాబాద్ పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించి ఈ సీజన్ లో 13 మ్యాచ్ లలో నాలుగే విజయాలతో  పాయింట్ల పట్టికలో  చివరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా  దానికి పోయేదేం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం  ఢిల్లీని  వెనక్కినెట్టి 9వ స్థానానికి చేరుకుంటుంది. ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు మెరుగుపర్చుకోవడానికి తప్ప సన్ రైజర్స్ కు ఈ ఫలితంతో ఏ ఉపయోగమూ లేదు.

Published at : 21 May 2023 03:30 PM (IST) Tags: MI Mumbai Indians SRH Sunrisers Hyderabad IPL MI Vs SRH IPL 2023 Indian Premier League 2023 IPL 2023 Match 69

సంబంధిత కథనాలు

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!