అన్వేషించండి

IPL 2024: విరాట్‌ విశ్వరూపమేనా?, బ్యాటింగ్ బెంగళూరుదే

MI vs RCB : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

MI vs RCB IPL 2024 Mumbai Indians opt to bowl: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై(MI) ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.  బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి ఒక్కడే భారాన్ని మోస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీకి ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు కరువవుతోంది. RCB నాకౌట్‌ చేరాలంటే ఇక్కడి నుంచి ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో మిగిలిన బ్యాటర్లు కూడా జూలు విధించాల్సి ఉంది. ఐపీఎల్‌లో తొలి దశ మ్యాచులో ముగుస్తున్నా బెంగళూరు బ్యాటర్లు పూర్తిగా గాడిన పడలేదు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (109 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (32), కామెరాన్ గ్రీన్ (68)లతో ఇప్పటివరకూ దారుణాంగా విఫలమయ్యారు. కోహ్లి మాత్రం భీకర ఫామ్‌లో ఉన్నాడు. 146.29 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో కోహ్లీ 316 పరుగులు చేశాడు. ఐదు నెలల క్రితం వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో తన 50వ వన్డే సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ మరోసారి ఈ మైదానంలో బరిలోకి దిగుతున్నాడు. తనకు 50 వ సెంచరీ మధుర జ్ఞాపకాలను ఇచ్చిన వాంఖడేలో మళ్లీ విజృంభించాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉన్నాడు. 
 
ఇరు జట్లకు కీలకమే
ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబైతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కూడా వరుసగా విఫలమవుతున్నా గత మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఐపీఎల్‌లో తొలి విజయం నమోదు చేసింది. బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడగా కేవలం ఒకే విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ముంబై తర్వాతి స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది. దాదాపుగా ముంబై కూడా అదే స్థితిలో ఉంది. ముంబై ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. 
 
హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 18 మ్యాచుల్లో విజయం సాధించగా.... బెంగళూరు 14 మ్యాచుల్లో విజయం సాధించింది. అన్ని మ్యాచుల్లోనూ ఫలితం వచ్చింది. ముంబైపై బెంగళూరు అత్యధిక స్కోరు 235 పరుగులు కాగా... బెంగళూరుపై ముంబై అత్యధిక స్కోరు 213 పరుగులు. బెంగళూరు అత్యల్ప స్కోరు 122 పరుగులు కాగా.. ముంబై అత్యల్ప స్కోరు 111 పరుగులు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్ అద్భుత గణాంకాలు కలిగి ఉన్నారు. ముంబైపై విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకూ 852 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ 786 పరుగులు చేశాడు. ముంబై తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ 793 పరుగులు, కీరన్ పొలార్డ్ 551 పరుగులు చేశారు. బౌలర్లలో ముంబై స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా 24 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్ 22 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్ 18 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget