అన్వేషించండి

IPL 2024: కేకేఆర్‌తో కీలక మ్యాచ్- టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్ ఏం తీసుకున్నాడంటే!

MI vs KKR, IPL 2024: వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబైతో .. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోన్న కోల్‌కతా నైట్ రైడర్స్ వాంఖడే వేదికగా తలపడనుంది.

MI vs KKR IPL 2024 Mumbai Indians opt to bowl:  కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌(KKR)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌గెలిచిన ముంబై(MI) తొలుత బౌలింగ్‌ తీసుకుంది. మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్‌ ఆశలైనా సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ముంబైకు విజయం తప్పనిసరి. మరోవైపు కోల్‌కతా టీమ్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు చేరేందుకు సమీపంలో ఉన్నా కోల్‌కత్తాకు ఈ మ్యాచ్‌ కీలకమే. వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేకుండా చేసుకున్న ముంబైతో .. తిరుగులేని నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కతా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌ అభిమానులకు వినోదాన్నిపంచనుంది. నైట్ రైడర్స్ తలపడనుంది. ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. కేకేఆర్‌ సెకండ్‌ ప్లేస్‌లో కుర్చీ వేసుకొని కూర్చుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.

రికార్డులు ఇలా...
ఇప్పటి వరకూ ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లు వాటి ఫలితాలను గమనిస్తే ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  ఈ రెండు జట్లూ 31 సార్లు తలపడగా.. ముంబై 23 సార్లు గెలవగా తొమ్మిది సార్లు కేకేఆర్ గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది.  ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన పది మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లు నెగ్గిన ముంబై  పాయింట్ల పట్టికలో అడుగు నుంచి రెండో స్థానం అంటే తొమ్మిదో స్థానానికే పరిమితమైంది. కోల్‌కతా పరిస్థితి ఐపీఎల్‌లో ఎప్పుడూ లేనంత పాజిటివ్ గా ఈ సీజన్‌లో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరింటిని గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 

స్టార్లు ఇప్పుడైనా  మెరుస్తారా
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్య వంటి స్టార్లు ముంబై జట్టులో ఉన్నా.. వారు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ముంబై విషయంలో హర్షించదగ్గ విషయమేంటంటే జస్ప్రీత్ బుమ్రా మాత్రం బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బొమ్మను చూపెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో అత్యదిక వికెట్లు తీసుకున్న ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. 200కు పైగా స్కోర్లు చేయడం ఎంత సులువో ఈ సీజన్‌లో కేకేఆర్ చూపించింది.  ఫిల్ సాల్ట్, సునిల్ నరైన్, రింకూ సింగ్ వంటి ప్లేయర్లు బ్యాట్ ఝుళిపించడంతో ఆ జట్టు అయిదు సార్లు 200కు పైగా స్కోర్లు సాధించింది. రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు బోలింగ్లో కీలకంగా వ్యవహరించడం సైతం జట్టు విజయాలకు బాటలు వేసింది. 


టాప్‌ స్కోర్‌లు ఇవే.. 
కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు  232/2. ఈ టోటల్ కేకేఆర్ 2019 సీజన్‌లో చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు 60 బంతుల్లో 109 పరుగులు.  2012 సీజన్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఎం.ఐ ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ను 27 పరుగుల తేడాతో ఓడించింది.  కేకేఆర్ తరఫున 2023లో వెంకటేశ్వర్ అయ్యర్ 104 పరుగులు చేశాడు.  ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయినా వెంకటేశ్వర్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది.  ఇక బౌలర్ల విషయానికొస్తే kkr-mi మ్యాచ్‌లలో బుమ్రా తీసిన 5/10 టాప్ కాగా... రస్సెల్ 5/15, నరైన్ 4/15 ఆ తరువాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget