అన్వేషించండి

IPL 2024: తమ్ముడు మళ్ళీ ఏసేశాడు, మ‌రోసారి మ‌యాంగ్ మాయ‌

Mayank Yadav : యువ సంచలనం మ‌యాంక్ యాద‌వ్  తన నిప్పులు చెరిగే బంతుల‌తో బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌ను హ‌డ‌లెత్తించాడు. మయాంక్  చెలరేగిపోవడంతో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు.

Mayank Yadav Breaks His Own Record For Fastest Ball: ఐపీఎల్‌(IPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) పరాజయ పరంపర కొనసాగుతోంది. లక్నో(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది.  182 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ.. 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో ఎల్ఎస్‌జీ 28 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా యువ సంచలనం మ‌యాంక్ యాద‌వ్  తన నిప్పులు చెరిగే బంతుల‌తో బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌ను హ‌డ‌లెత్తించాడు. మయాంక్  చెలరేగిపోవడంతో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. 4 ఓవ‌ర్లలో కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌(LSG) యంగ్ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ తన ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. గత మ్యాచ్ లోనే  వేగవంతమైన బంతిని సంధించి ఇప్పటివరకు ఐపీఎల్‌-2024లోనే ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇంకా ఆ రికార్డ్ను క్రికెట్ అభిమానులు మరచవపోఎలోపే మరో రికార్డ్ సృష్టించాడు.   ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా మూడుసార్లు గంట‌కు 155 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు వేసి రికార్డుకెక్కాడు. మ‌యాంక్ కేవ‌లం 2 మ్యాచుల్లో 50 కంటే త‌క్కువ బంతులే వేసి ఈ ఫీట్‌ను సాధించ‌డం విశేషం.  మయాంక్ తొలి నుంచి నిలకడగా 145kmph కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. ఒక దశలో మయాంక్ వేసిన బంతి 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది. ఈ ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతి అదేకావటం విశేషం. అంటే తన గత రికార్డును తను ఆడిన రెండో మ్యాచ్ లోనే బద్దలు కొట్టాడు. 

బ్యాటర్లను బెంబేలెత్తించే మయాంక్ యాదవ్: 

ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల పేసర్ మయాంక్ యాదవ్.    దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటివరకు ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిసి 27 మ్యాచుల్లో 46 వికెట్లు తీశాడు. నార్త్ జోన్ తరఫున ‘దేవధర్ ట్రోఫీ’లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.  కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసి జాయింట్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. దీంతో 2022 ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ధర రూ.20 లక్షల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.  కానీ అతడు గాయం కారణంగా ఐపీఎల్‌-2023 సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. నిన్నటి మ్యాచ్ కి మార్క్ ఉడ్ అందుబాటులో లేకపోవడంతో  మయాంక్ యాదవ్‌కు చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ తన మొదటి మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి,  కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు.  ఇక ఇప్పుడు 4 ఓవ‌ర్లలో కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తన ప్రదర్శన గాలివాటం కాదని మయాంక్ యాదవ్ నిరూపించుకున్నాడు. 

 ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన బంతి వేసింది షాన్ టైట్. అతను వేసిన బంతి 157.7kmph వేగంతో దూసుకెళ్లింది.  2011 ఐపీఎల్ సీజ‌న్‌లో షాన్ టైట్ ఈ ప్రదర్శన చేశాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
ISROs 100th Mission: ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
Telugu TV Movies Today: మహేష్ ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ టు రవితేజ ‘కిక్ 2’, రామ్ ‘హైపర్’ వరకు- ఈ సోమవారం (ఫిబ్రవరి 3) టీవీలలో వచ్చే సినిమాలివే
మహేష్ ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ టు రవితేజ ‘కిక్ 2’, రామ్ ‘హైపర్’ వరకు- ఈ సోమవారం (ఫిబ్రవరి 3) టీవీలలో వచ్చే సినిమాలివే
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
ISROs 100th Mission: ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
Telugu TV Movies Today: మహేష్ ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ టు రవితేజ ‘కిక్ 2’, రామ్ ‘హైపర్’ వరకు- ఈ సోమవారం (ఫిబ్రవరి 3) టీవీలలో వచ్చే సినిమాలివే
మహేష్ ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ టు రవితేజ ‘కిక్ 2’, రామ్ ‘హైపర్’ వరకు- ఈ సోమవారం (ఫిబ్రవరి 3) టీవీలలో వచ్చే సినిమాలివే
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Viral News: నర్సీపట్నంలో కత్తితో యువతి హల్‌చల్, ప్రశ్నిస్తే సీబీఐ అంటూ ఆన్సర్
Viral News: నర్సీపట్నంలో కత్తితో యువతి హల్‌చల్, ప్రశ్నిస్తే సీబీఐ అంటూ ఆన్సర్
Fertility Concerns : పెర్​ఫ్యూమ్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త సంతాన సమస్యలు రావొచ్చు.. రూమ్ ఫ్రెషనర్స్​తో కూడా
పెర్​ఫ్యూమ్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త సంతాన సమస్యలు రావొచ్చు.. రూమ్ ఫ్రెషనర్స్​తో కూడా
AP CM Chandrababu: ప్యాలెస్‌లు కట్టుకునేవారు వద్దు, ప్రజల కోసం పనిచేసేవారిని గెలిపించండి- ఢిల్లీ ప్రజలకు చంద్రబాబు పిలుపు
ప్యాలెస్‌లు కట్టుకునేవారు వద్దు, ప్రజల కోసం పనిచేసేవారిని గెలిపించండి- ఢిల్లీ ప్రజలకు చంద్రబాబు పిలుపు
kadiri Registrar: ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
Embed widget