News
News
వీడియోలు ఆటలు
X

LSG Vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు - లక్నోపై రివెంజ్‌కు రెడీ!

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

FOLLOW US: 
Share:

Punjab Kings vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌ 2023 సీజన్ 43వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మొదట బౌలింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ ఇప్పటికే జరిగింది. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి లక్నో విజయం సాధించింది. దీంతో ప్రతీకార విజయం కోసం బెంగళూరు ఎదురు చూస్తుంది.

పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ తేడాతో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ 4కు చేరే అవకాశం ఉంది. అదే లక్నో గెలిస్తే వారు మొదటి స్థానానికి వెళ్తారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, వైశాక్, బ్రేస్‌వెల్, సోను యాదవ్.

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆయుష్ బదోని, డేనియల్ సామ్స్, అవేష్ ఖాన్, క్వింటన్ డి కాక్, ప్రేరక్ మన్కడ్.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఒక్కసారిగా తమ వ్యూహం మార్చేసింది. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌గా ఆడాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే గెలిచే మ్యాచుల్నీ చిన్న చిన్న తేడాలతో పోగొట్టుకోవడమే ఇందుకు కారణం. అందుకే వికెట్‌ పోయినా సరే మొహాలిఆలో కేఎల్‌ రాహుల్‌ వేగంగా ఆడేందుకు ట్రై చేశాడు. ఇక కైల్‌ మేయర్స్‌ క్రీజులో నిలిస్తే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే. ఆయుష్ బదోనీ ఫామ్‌లోకి వచ్చేశాడు. దీపక్‌ హుడా మూమెంటమ్‌ అందుకున్నాడు. ఇక విండీస్‌ వీరుడు నికోలస్‌ పూరన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ అపోజిషన్‌ బౌలింగును ఊచకోత కోస్తున్నారు. మొహాలిలో ఫీల్డింగ్‌ చేస్తుండగా స్టాయినిస్‌ చేతికి గాయమైంది. స్కానింగ్‌లో మరీ సీరియస్‌ లేదని తెలిసింది. అయితే రెస్ట్‌ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అయితే బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ కొంత జాగ్రత్తగా ఉండాలి. బిష్ణోయ్ రన్స్‌ లీక్‌ చేస్తున్నాడు. అమిత్‌ మిశ్రా ఫర్వాలేదు. అవేశ్‌, నవీన్‌ ఉల్‌ హఖ్‌ బౌలింగ్‌ అదుర్స్‌. మార్క్‌వుడ్‌, మేయర్స్‌, స్టాయినిస్‌ అందుబాటులో ఉన్నారు. ఇండియన్‌ కుర్ర పేసర్లూ సత్తా చాటుతున్నారు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు ఎక్కువగా హోమ్‌ గేమ్స్‌ ఆడింది. తొలి ఎనిమిదిలో ఆరు చిన్నస్వామిలోనే జరిగాయి. కర్ణాటక ఎలక్షన్ల వల్ల ఇలా షెడ్యూలు చేశారు. ఇప్పుడికి ఎక్కువగా అవే.. గేమ్స్‌ ఆడాల్సి ఉంటుంది. మొదట డిఫికల్ట్‌ ఏకనాకు వస్తోంది. అయితే బౌలింగ్‌ ఫ్రెండ్లీ కండీషన్స్‌ ఉంటాయి కాబట్టి సిరాజ్‌, హర్షల్‌, హసరంగ, షాబాజ్‌ చెలరేగుతారు. డేవిడ్‌ విలే గాయపడటంతో జోష్‌ హేజిల్‌ వుడ్‌ ఆడే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో సిరాజ్ బౌలింగ్‌ అదుర్స్‌! బ్యాటింగ్‌ ఆర్డర్లో మాత్రం వీక్‌నెస్‌లు ఉన్నాయి. టాప్‌ 3లో కోహ్లీ, డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ మినహా ఎవ్వరూ ఆడటం లేదు. వీరిలో ఏ ఇద్దరు త్వరగా ఔటైనా మిడిలార్డర్‌ కొలాప్స్‌ అవ్వడం ఖాయమే! దినేశ్ కార్తీక్‌ అంతగా ఫామ్‌లో లేడు. అయితే ఏకనాలో లక్నో బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయొద్దు. డుప్లెసిస్‌ పూర్తిగా ఫిట్‌నెస్‌తో ఉన్నాడో లేదో తెలియడం లేదు.

Published at : 01 May 2023 07:13 PM (IST) Tags: RCB Punjab Kings IPL LSG IPL 2023 Indian Premier League 2023 Royal Challengers Bangalore LSG Vs RCB IPL 2023 Match 43

సంబంధిత కథనాలు

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం