IPL 2024: చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు, లక్నో టార్గెట్ 145 రన్స్
LSG vs MI, IPL 2024: ఐపీఎల్ 2024 . సీజన్17 లో భాగంగా లక్నో, ముంబై జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
LSG vs MI IPL 2024 Lucknow Super Giants 145: లక్నో(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు(MI) చేతులెత్తేశారు. ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో... ముంబై బ్యాటర్లు కేవలం 144 పరుగులకే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులే చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై లక్నో బౌలర్లు అంచనాలను మించి రాణించారు. ముంబై బ్యాటర్లలో నేహల్ వధేరా 46 పరుగులు చేసి రాణించాడు. టిమ్ డేవిడ్ 35, ఇషాన్ కి,న్ 32 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
కట్టుదిట్టంగా బౌలింగ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో... ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇది సరైన నిర్ణయమే అని కాసేపటికే నిరూపితమైంది. ఏడు పరుగులకే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. అయిదు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన రోహిత్ శర్మను మోసిన్ ఖాన్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. ఆరు బంతుల్లో పది పరుగులు చేసిన సూర్యాను స్టోయినిస్ అవుట్ చేశాడు. దీంతో 18 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ కష్టాలు తర్వాత కూడా కొనసాగాయి. 27 పరుగుల వద్ద ఏడు పరుగులు చేసిన తిలక్ వర్మ అవుటవ్వగా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. దీంతో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత ఇషాన్ కిషన్, నెహల్ వధేరా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ ముంబై స్కోరును 27 పరుగుల నుంచి 80 పరుగులకు తీసుకెళ్లగా మళ్లీ ముంబైకు షాక్ తగిలింది. 36 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను రవి భిష్ణోయ్ అవుట్ చేశాడు. కాసేపటికే వదేరా కూడా పెవిలియన్ చేరాడు. 41 బంతుల్లో నాలుగు పోర్లు, రెండు సిక్సర్లతో 46 పరుగులు చేసిన వధేరాను మోహిన్ ఖాన్ బౌల్డ్ చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేయడంతో ముంబై 144 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో మెహిన్ ఖాన్ 2, స్టోయినిస్ 1, మయాంక్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
గత రికార్డులు చూస్తే ..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-ముంబై నాలుగుసార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు మ్యాచుల్లో విజయం సాధించగా... ముంబై కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. లక్నోపై ముంబై 2023 సీజన్‌లో 182 పరుగులు నమోదు చేసింది.ముంబై తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. లఖ్‌నవూకు కూడా ఇది కీలకమైన మ్యాచే. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 ఓటములతో ఉంది. ముంబయిపై నెగ్గితే లఖ్‌నవూ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి.