
LSG vs CSK, IPL 2022 LIVE: చరిత్ర చూడని CSK ఓటమి! LSGకి మాత్రమే సాధ్యమైంది.. 211 ఉఫ్!
Lucknow Supergiants vs Chennai Superkings: ఐపీఎల్ 2022 ఏడో మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ పోరుతో ఎవరో ఒకరు గెలుపు ఖాతా తెరుస్తారు.
LIVE

Background
చరిత్ర చూడని CSK ఓటమి! LSGకి మాత్రమే సాధ్యమైంది.. 211 ఉఫ్!
LSG vs CSK, IPL 2022 LIVE: చెన్నై నిర్దేశించిన 211ను లక్నో ఛేదించేసింది. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఒక సీజన్లో రెండు మ్యాచులు ఓడిపోవడం ఇదే తొలిసారి. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా ముకేశ్ వరుసగా రెండు వైడ్లు ఇచ్చాడు. ఆ తర్వాత రెండు బంతుల్ని ఆయుష్ బదోనీ (19) వరుసగా రెండు సిక్సర్లు కొట్టి గెలిపించాడు. కేఎల్ రాహుల్‌కు తొలి విజయం దక్కింది.
19 ఓవర్లకు లక్నో 202-4
LSG vs CSK, IPL 2022 LIVE: శివమ్ దూబె 25 పరుగులు ఇచ్చాడు. బదోనీ (12) సిక్స్ బాదాడు. లూయిస్ (55) వరుసగా 4, 4, 6 బాదేశాడు. విజయానికి మరో 9 పరుగులే కావాలి.
18 ఓవర్లకు లక్నో 177-4
LSG vs CSK, IPL 2022 LIVE: డ్వేన్ బ్రావో 12 పరుగులిచ్చి వికెట్ తీశాడు. లూయిస్ (39), బదోనీ (5) నిలకడగా ఆడుతున్నారు. వారికి 12 బంతుల్లో 34 పరుగులు కావాలి.
దీపక్ హుడా ఔట్
LSG vs CSK, IPL 2022 LIVE: డ్వేన్ బ్రావో వేసిన 17.2వ బంతికి దీపక్ హుడా (13) ఔటయ్యాడు.
17 ఓవర్లకు లక్నో 165-3
LSG vs CSK, IPL 2022 LIVE: ప్రిటోరియస్ 9 పరుగులే ఇచ్చాడు. ఎవిన్ లూయిస్ (39) ఒక సిక్సర్ బాదాడు. హుడా (7) నిలకడగా ఆడుతున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
