IPL 2024: 300 సిక్సర్ల క్లబ్‌లో రాహుల్, అయిదో ఇండియన్‌గా రికార్డు
KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. . కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 300 సిక్సర్లు బాదిన ఐదో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Kl Rahul Becomes Fifth India Batter To Hit 300 T20 Sixes : లక్నో సూపర్ జెయింట్స్(LSG) సారధి కే.ఎల్. రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ 20 మ్యాచుల్లో 300 సిక్సర్లు బాదిన ఐదో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో టీ 20 మ్యాచుల్లో మూడు వందల సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 218 టీ20 మ్యాచుల్లో 300 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఏకంగా 497 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా ఉన్నారు. రోహిత్ శర్మ 431 మ్యాచుల్లో 497 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా... విరాట్ కోహ్లి 382 మ్యాచుల్లో 383 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోని 382 మ్యాచుల్లో 328 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.... సురేశ్ రైనా 336 మ్యాచుల్లో 325 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 218 మ్యాచుల్లో 300 సిక్సర్లు కొట్టి అయిదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ కొట్టిన ఐపీఎల్‌లో 178 సిక్సర్లు కొట్టగా... టీమ్ఇండియా తరుపున 99 సిక్సర్లు బాదాడు. దేశవాళీలో కర్ణాటక తరుపున 23 సిక్సర్లు కొట్టాడు.
లక్నోకు తప్పని ఓటమి
లక్నో(LSG)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా(KKR) ఘన విజయం సాధించింది. తొలుత బంతితో లక్నోకు ఓ మోస్తరు పరుగులకే కట్టడి చేసిన కోల్‌కత్తా తర్వాత సునాయసంగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 45 పరుగులు, కెప్టెన్ కె.ఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించడంతో లక్నో 161 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా లక్నోలో మరే బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేదు. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా సాల్ట్ విజృంభణతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఒంటి చేత్తో కోల్‌కత్తాకు విజయాన్ని అందించాడు. అయ్యర్ కూడా 38 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో కోల్‌కత్తా మరో 26 బంతులు ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నికోలస్ పూరన్ 45 పరుగులు, కెప్టెన్ కె.ఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించడంతో లక్నో 161 పరుగులు చేసింది. కోల్‌కత్తా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, వైభవ్ ఆరోరా, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు. ఫిల్ సాల్ట్ 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఒంటి చేత్తో కోల్‌కత్తాకు విజయాన్ని అందించాడు. అయ్యర్ కూడా 38 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణతో కోల్‌కత్తా మరో 26 బంతులు ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.