IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్లో కుప్పకూలిన హైదరాబాద్, ప్రత్యర్థి కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్
KKR vs SRH IPL Final 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లు రెచ్చిపోయారు. దొరికినవారికి దొరికినట్టు అవుట్ చేస్తూ పరుగులను కట్టడి కాదు ఏకంగా వికెట్లు ఎగరగొట్టేశారు.
KKR vs SRH IPL Final 2024: ఐపీఎల్(IPL) తుది సమరంలో హైదరాబాద్(SRH) బ్యాటర్లు చేతులేత్తేశారు. కోల్‌కత్తా(KKR) బౌలర్లు ముందు నిస్సహాయులైపోయారు. టైటిల్ సాధించే సువర్ణావకాశంతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాటర్లు... ఫైనల్స్‌లో పూర్తిగా తడబడ్డారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న విచ్‌పై కోల్‌కత్తా బౌలర్లు చెలరేగిపోయిన వేళ... దుర్బేద్యంగా కనిపించిన హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్, షాబాజ్ అహ్మద్ అలా వచ్చి ఇలా వికెట్లు పారేసుకున్నారు.
చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ కాసేపు పోరాడడంతో హైదరాబాద్ స్కోరు వంద పరుగులు దాటింది. హైదరాబాద్ బ్యాటర్లలో కనీసం ఏ ఒక్క బ్యాటర్ కూడా 25 పరుగుల మార్క్‌ను దాటలేదంటే వికెట్ల పతనం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కోల్‌కత్తా బౌలర్లలో మిచెల్ స్టార్క్ వికెట్ల పతనాన్ని ప్రారంభించగా.... మిగిలిన బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్ల పనిపట్టారు. తొలి ఓవర్‌లోనే ప్రారంభమైన హైదరాబాద్ వికెట్ల పతనం చివరి వరకూ నిరాటకంగా సాగింది. మొత్తానికి 18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3వికెట్లు తియ్యగా , మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణాలు చెరో రెండు వికెట్లు తీసారు. వైభవ్ అరోరా, నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఇక చెపాక్‌లో హైదరాబాద్ బౌలర్లు ఏమైనా అద్భుతం చేస్తారో... లేక వీళ్లు కూడా చేతులెత్తేస్తారో చూడాలి.
పేకమేడను తలపిస్తూ..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు అది ఎంత చెత్త నిర్ణయమో మొదటి ఓవర్‌లోనే తెలిసివచ్చింది. కోల్‌కత్తా బౌలర్ల ముందు హైదరాబాద్ బ్యాటర్లు నిస్సహాయంగా మిగిలిపోయారు. ప్రతీ బంతికి వికెట్ తీసేలా కనిపించిన కోల్‌కత్తా బౌలర్ల ముందు హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. బ్యాటింగ్‌కు దిగిన తొలి ఓవర్‌లోనే మిచెల్ స్టార్క్ మరోసారి హైదరాబాద్‌ను చావు దెబ్బ తీశాడు. ఈసీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మను బౌల్డ్ చేశాడు. అంతే అప్పుడు మొదలైన వికెట్ల పతనం నిరాటంకంగా కొనసాగింది. అభిషేక్ శర్మ 2, ట్రానిస్ హెడ్ 0, రాహుల్ త్రిపాఠి 9. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 40/3. తరువాత కూడా నితీశ్ కుమార్ రెడ్డి 13, హెన్రిచ్ క్లాసెన్ 16, షాబాజ్ అహ్మద్ 8, అబ్దుల్ సమద్ నాలుగు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు.
కలకత్తా జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో 11 ఓవర్లు పూర్తి అయ్యేసరికి హైదరాబాద్ జట్టు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. తరువాత కూడా హైదరాబాద్ కష్టాలు కొనసాగాయి. షాబాజ్ అహ్మద్8, అబ్దుల్ సమద్ 4 పరుగులకేపెవిలియన్ చేరారు. తరువాత బరిలో దిగిన క్లాసెన్ కూడా 16 పరుగులను మించలేకపోయాడు. అయితే నరైన్ వేసిన 16 ఓవర్లో ఐదో బంతికి కమిన్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మిచెల్ స్టార్క్ మిస్ చేశాడు. దీంతో కమిన్స్ కి లైఫ్ దొరికింది. అతి కష్టం మీద హైదరాబాద్ బ్యాటర్లు 17 ఓవర్ల స్కోర్ ను 100 దాటించగలిగారు. ఉనద్కత్ 4 పరుగులకే ఔట్ అవ్వడంతో 18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌటైంది. టాప్ స్కోరర్‌గా నిలిచిన పాట్ కమిన్స్ (24) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3వికెట్లు తియ్యగా , మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణాలు చెరో రెండు వికెట్లు తీసారు. వైభవ్ అరోరా, నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.