KKR Vs RCB: టాస్ గెలిచిన ఆర్సీబీ - మొదట బౌలింగే అన్న డుఫ్లెసిస్!
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.
#RCB have won the toss and elect to bowl first against #KKR at the Eden Gardens.
— IndianPremierLeague (@IPL) April 6, 2023
Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/dmdLoz53QN
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
మన్‌దీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఎన్ జగదీసన్, డేవిడ్ వైస్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
ఫిన్ అలెన్, సోను యాదవ్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్
చిన్న స్వామి మైదానం చిన్నది. పైగా బ్యాటింగ్ ట్రాక్! ఇలాంటి పిచ్‌పై ముంబయి ఇండియన్స్‌ను తక్కువ స్కోరుకే కంట్రోల్ చేసింది ఆర్సీబీ! అదీ తక్కువ బౌలింగ్ వనరులతోనే! జోష్ హేజిల్ వుడ్ లేడు. టాప్లీ గాయపడ్డాడు. రజత్ పాటిదార్ దూరమయ్యాడు. అందుకే కేకేఆర్‌తో మ్యాచ్ ఈజీ కాదు! హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ పేస్ బాగుంది. డేవిడ్ విలే వీరికి తోడుగా ఉంటాడు. కెప్టెన్ డుప్లెసిస్, కింగ్ కోహ్లీ సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిదే కంటిన్యూ చేయాలి. అయితే వరుణ్, నరైన్, అనుకుల్ రాయ్ స్పిన్‌తో వీరికి ముప్పే. డుప్లెసిస్, కోహ్లీ, మాక్సీకి వీరికి మంచి రికార్డు లేదు. మిడిలార్డర్ ఎలా ఆడుతుందో చూడాలి.
తొలి మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అచ్చి రాలేదు. టాప్ నుంచి మిడిలార్డర్ వరకు బలహీనంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో జేసన్ రాయ్‌ను తీసుకోవడం మంచిదే. అయితే ఈ మ్యాచుకు అతడు అందుబాటులో ఉండడు. వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్ మినహా ఎవరూ ఫామ్‌లో లేరు. ఓపెనర్లు మణ్‌దీప్ సింగ్, గుర్బాన్ మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇవ్వాలి. అనుకుల్ రాయ్, రాణా, రింకూ సింగ్ బాధ్యతాయుతంగా ఆడాలి. పేస్‌కు సహకరించే ఈడెన్‌లో సౌథీ, రసెల్, శార్దూల్ ఇంపాక్ట్ చూపొచ్చు. పేసర్ లాకీ ఫెర్గూసన్ తోడైతే ఎదురుండదు. బ్యాటింగ్ పిచ్‌లోనే సూపర్ బౌలింగ్ వేసిన ఆర్సీబీ పేసర్లతో కేకేఆర్‌కు డేంజరే!
ఈడెన్ అంటే గుర్తొచ్చేది ఛేదన! ఇక్కడ రెండో బ్యాటింగ్ సులువుగా ఉంటుంది. డ్యూ ఫాక్టర్ అదనపు ప్రయోజనం కల్పిస్తుంది. పెద్ద బౌండరీలు కావడంతో స్పిన్నర్లూ ప్రభావం చూపిస్తారు. మొదట్లో బంతిని స్వింగ్ చేయొచ్చు. బ్యాటర్లు నిలదొక్కుకుంటే సెంచరీలు కొట్టొచ్చు.