అన్వేషించండి

KKR vs MI, IPL 2022 LIVE: 14 బంతుల్లో కమిన్స్‌ హాఫ్‌ సెంచరీ.. ఒకే ఓవర్లో 35 రన్స్‌! అంతే కేకేఆర్‌ గెలిచేసింది

IPL 2022, KKR vs MI Preview: ఐపీఎల్‌ 2022 సీజన్‌ 14వ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders), ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) తలపడుతున్నాయి. మరి వీరిలో పైచేయి ఎవరిది?

LIVE

Key Events
KKR vs MI, IPL 2022 LIVE: 14 బంతుల్లో కమిన్స్‌ హాఫ్‌ సెంచరీ.. ఒకే ఓవర్లో 35 రన్స్‌! అంతే కేకేఆర్‌ గెలిచేసింది

Background

IPL 2022, KKR vs MI Preview: ఐపీఎల్‌ 2022 సీజన్‌ 14వ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders), ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) తలపడుతున్నాయి. పుణె ఇందుకు వేదిక. రెండు విజయాలతో కేకేఆర్‌ జోష్‌తో ఉంది. రెండు పరాజయాలతో ముంబయిలో పట్టుదల పెరిగింది. మరి వీరిలో పైచేయి ఎవరిది? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఏ ఆటగాళ్ల కీలకం కాబోతున్నారు?

KKRపై MIదే ఆధిపత్యం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు చరిత్రలో ముంబయి ఇండియన్స్‌ అత్యంత బలమైన జట్టు. ఐదు సార్లు ట్రోఫీలు గెలిచింది. రెండు సార్లు ట్రోఫీలు గెలిచిన కోల్‌కతాపై వారికి తిరుగులేని ఆధిపత్యం ఉంది. విన్నింగ్‌ పర్సెంటేజీ 75 శాతం ఉందటేనే అర్థం చేసుకోవచ్చు. లీగులో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడితే రోహిత్‌ సేన ఏకంగా 22 సార్లు గెలిచింది. కేకేఆర్‌ 7 విజయాలకే పరిమితమైంది. చివరి సారి తలపడ్డ ఐదు మ్యాచుల్లోనూ 4-1తో ముంబయిదే ఆధిపత్యం. మరి ఈ సీజన్లో రెండు ఆడి రెండూ ఓడిన మాజీ ఛాంపియన్‌ బోణీ కొడుతుందేమో చూడాలి.

Ishan vs Cummins, Rohit vs Narine చూడాల్సిందే

నేటి మ్యాచులో కొందరు ఆటగాళ్ల మధ్య రైవలరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. ముఖ్యంగా కమిన్స్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ఇప్పటికే వరకు మూడు ఇన్నింగ్సుల్లో కేవలం ఐదు బంతులే ఆడి మూడుసార్లు ఔటయ్యాడు. ఇక మిస్టరీ స్పిన్నర్‌ సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) నిలదొక్కుంటాడేమో చూడాలి. ఎందుకంటే 18 ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్‌ను నరైన్‌ 7 సార్లు ఔట్‌ చేశాడు. సగటు 19.6. ఇక పుణెలో పేసర్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టాస్‌తో సంబంధం లేకుండా విజయాలు లభిస్తున్నాయి.

KKR vs MI Probable XI

ముంబయి ఇండియన్స్‌ : రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ / అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, తిలక్‌వర్మ, కీరన్‌ పొలార్డ్‌, టిమ్‌ డేవిడ్‌, డేనియెల్‌ సామ్స్‌, మురుగన్‌ అశ్విన్, తైమల్‌ మిల్స్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ / బాసిల్‌ థంపి, జస్ప్రీత్‌ బుమ్రా

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: వెంకటేశ్‌ అయ్యర్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, నితీశ్ రాణా, షెల్డన్‌ జాక్సన్‌, ఆండ్రీ రసెల్‌, సునిల్‌ నరైన్‌, టిమ్‌ సౌథీ, ప్యాట్‌ కమిన్స్‌, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి

23:02 PM (IST)  •  06 Apr 2022

KKR vs MI, IPL 2022 LIVE: కోల్‌కతా విక్టరీ

డేనియెల్‌ సామ్స్‌ వేసిన ఈ ఓవర్లో కమిన్స్‌ (56) వరుసగా 6, 4, 6, 6, 2, 4, 6 బాదేశాడు. 35 పరుగులు రాబట్టాడు. 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. వెంకటేశ్‌ (50) ఆఖరి వరకు నిలిచాడు. ముంబయి వరుసగా మూడో ఓటమి చవిచూసింది.

22:53 PM (IST)  •  06 Apr 2022

KKR vs MI, IPL 2022 LIVE: 15 ఓవర్లకు కోల్‌కతా 127-5

జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ పడటం లేదు. 12 రన్స్‌ ఇచ్చాడు. కమిన్స్‌ (22) వరుసగా సిక్స్‌, బౌండరీ బాదేశాడు. వెంకటేశ్‌ (50) హాఫ్‌ సెంచరీ చేశాడు.

22:46 PM (IST)  •  06 Apr 2022

KKR vs MI, IPL 2022 LIVE: 14 ఓవర్లకు కోల్‌కతా 115-5, రసెల్‌ ఔట్‌

తైమల్‌ మిల్స్‌ ఈ ఓవర్లో 14 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. తొలి బంతికే ఆండ్రీ రసెల్‌ (11)ను ఔట్‌ చేశాడు. అయితే ఆఖరి రెండు బంతుల్ని కమిన్స్‌ (11) వరుసగా 6, 4 బాదేశాడు. వెంకటేశ్‌ (49) ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

22:40 PM (IST)  •  06 Apr 2022

KKR vs MI, IPL 2022 LIVE: 13 ఓవర్లకు కోల్‌కతా 101-4

బుమ్రా 12 పరుగులు ఇచ్చాడు. రసెల్‌ (11), వెంకటేశ్‌ (46) చెరో బౌండరీ కొట్టారు.

22:35 PM (IST)  •  06 Apr 2022

KKR vs MI, IPL 2022 LIVE: 12 ఓవర్లకు కోల్‌కతా 89-4

మురుగన్‌ అశ్విన్‌ 8 పరుగులిచ్చి నితీశ్‌ రాణా (8)ని ఔట్‌ చేశాడు. వచ్చీ రాగానే ఆండ్రీ రసెల్‌ (6) సిక్సర్‌ బాదేశాడు. వెంకటేశ్ (39) నిలకడగా ఆడుతున్నాడు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget