అన్వేషించండి

KKR vs MI IPL 2024: నరైన్‌కి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు- మ్యచ్ హైలైట్ ఇదే

KKR vs MI IPL 2024: ఈ సీజన్ లో బ్యాటు, బాలు.. రెండిటితోనూ విధ్వంసం చేస్తూ ఎవ్వరికీ అందట్లేదు కేకేఆర్ ప్లేయర్ సునిల్ నరైన్. అలాంటిది ముంబయితో మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు.

Jasprit Bumrah bowled Sunil Narine: ఈ సీజన్ లో బ్యాటింగ్ తో విధ్వంసం బౌలింగ్ తో రచ్చ రచ్చ.. చేస్తోన్న సునీల్ నరైన్ ఎవ్వరికీ అందట్లేదు అసలు. బ్యాటింగ్ లో 12 మ్యాచుల్లో 461పరుగులు చేశాడు సునీల్ నరైన్. మూడు హాఫ్ సెంచరీలు.. ఓ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఏ టీమ్ ను, ఏ బౌలర్ ను వదిలిపెట్టలేదు. అటు బౌలింగ్ లోనూ అంతే 15వికెట్లు తీశాడు. అటు ఆరెంజ్ క్యాప్ రేస్ లోనూ ఇటు పర్పుల్ క్యాప్ రేస్ లోనూ రెండింటిలోనూ ఆరోస్థానంలో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు నరైన్ ఆల్ రౌండ్ షో ఎలా ఉందో ఈ సారి. అలాంటి నరైన్ ని నిన్న బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఉంది చూడండి. మెంటల్ మాస్ అంతే.

తను వేస్తున్న మొదటి ఓవర్ మొదటి బంతినే యార్కర్ లెంగ్త్ లో విసిరాడు. చూడటానికి అది అవుట్ స్వింగర్ లా కనిపించింది. నరైన్ కే కాదు అందరికీ ఇలాగే కనిపిస్తుంది. దీన్ని కెలికి రిస్క్ తీసుకోవడం ఎందుకు లే అనుకున్నాడేమో.. ఏదో టెస్టు మ్యాచులో బ్యాటర్ వదిలేసినట్లు వదిలేశాడు నరైన్. అయితే బుమ్రా విసిరిన ఆ బాల్ లేట్ ఇన్ స్వింగర్. పడిన తర్వాత ఇన్ స్వింగ్ అయ్యి నరైన్.. స్పందించే లోపే వికెట్లను బలంగా ఢీకొట్టింది. అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్ లో ఏం జరిగిందో తెలుసుకునే లోపే నరైన్ అవుటైపోయాడు. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వడు కాబట్టి ఏం అనుకున్నాడో తెలియలేదు కానీ.. లోపల మాత్రం ‘ఎవ్వుర్రా వీడు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు’ అని కచ్చితంగా అనుకునే ఉంటాడు.  మరి విసిరినోడు ఏమన్నా తుంబ్రీ బౌలరా పవర్ ప్లేలో గుడ్డి ఊపుడు ఊపి సిక్సులు కొట్టడానికి బూమ్ బూమ్ బుమ్రా అని ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

బుమ్రా కథే వేరు.. 

అందరిలా కాకుండా విశిష్టమైన బౌలింగ్ యాక్షన్, స్థిరంగా యార్కర్లు వేయగల సామర్థ్యంతో బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్లలో ఒకడిగా మారాడు. ఈ మధ్యే ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగుల్లో నంబర్ వన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టి..  ఫస్ట్ ప్లేస్‌కి ఎగబాకాడు. బుమ్రా సాధించిన ఈ ఫీట్ ఇండియన్ క్రికెట్‌కే ఒక మైల్ స్టోన్‌గా భావిస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్‌లో గుజరాత్ తరుఫుర ఆడే బుమ్రా.. ఐపీఎల్‌లో ముంబైకి ఒక ప్రధాన ఆయుధంగా కొనసాగుతున్నాడు. అయితే బుమ్రా ఇచ్చిన సపోర్ట్‌తో విన్నింగ్ ఇన్నింగ్స్‌లను సక్రమంగా ప్లాన్ చేయడంలో ఈ సీజన్‌లో ముంబయి మొదటి నుంచి విఫలమవుతోంది. 

ఇప్పటి వరకూ ఈ  ఐపీఎల్ సీజన్‌లో 20 వికెట్లు తీసిన బుమ్రా.. ప్రస్తుతం హర్షల్ పటేల్‌తో కలిసి పర్పుల్ క్యాప్‌ను పంచుకుంటున్నాడు.  ఆర్సీబీ మీద ఒకే మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు.  రెండు సార్లు ఒకే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. ఆరు కంటే తక్కువ ఎకానమీతో ఏడు మ్యాచుల్లో బౌలింగ్ చేశాడు.  మొత్తం పదమూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 10 సిక్సర్ల లోపే కొట్టించుకున్నాడు. ఇదీ బుమ్రా.. కథ మరీ. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Embed widget