![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్‌స్క్రిప్షన్ రూ.300 లోపే!
ఐపీఎల్ వచ్చే సంవత్సరం నుంచి వూట్ యాప్‌లో లైవ్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.
![IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్‌స్క్రిప్షన్ రూ.300 లోపే! IPL May be Streamed in Voot From 2023 to 2027 Viacom 18 Gets Digital Rights IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్‌స్క్రిప్షన్ రూ.300 లోపే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/29bcb753074b4556b696d04a4cf78e44_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం ముగిసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు టీవీ హక్కులను సోనీ, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను వయాకాం 18 దక్కించుకున్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా రూ.44,075 కోట్లకు ఈ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. వీటిలో టీవీ హక్కులు రూ.23,575 కోట్లకు, డిజిటల్ హక్కులు రూ.20,500 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు స్టార్ గ్రూపు చేజారిపోయాయి కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ను చూడలేం. వయాకాం 18కు సంబంధించిన వూట్ స్ట్రీమింగ్ యాప్‌లో ఐపీఎల్ ప్రసారమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం వూట్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు సంవత్సరానికి రూ.299గా ఉంది. ఒకేసారి నాలుగు డివైస్‌ల్లో ఈ యాప్‌లోని కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. ఈ రూ.299ని లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా పేర్కొంటున్నారు. అంటే భవిష్యత్తులో ధర పెరిగే అవకాశం ఉంది.
హిందీ బిగ్‌బాస్, కన్నడ బిగ్‌బాస్, బిగ్‌బాస్ ఓటీటీలను కూడా వూట్‌లో చూడవచ్చు. అసుర్, కోడ్ ఎం, లండన్ ఫైల్స్, ఇల్లీగల్, అపహరణ్ వంటి టాప్ రేటెడ్ ఇండియన్ వెబ్ సిరీస్‌లు కూడా వూట్‌లో అందుబాటులో ఉన్నాయి.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)