LSG vs GT Toss Update: హార్దిక్ టాస్ గెలిచాడు! గూగ్లీ స్పిన్నర్‌ను వదిలేసి రాహుల్ సాహసం!
LSG vs GT Toss Update: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో రెండు మార్పులు చేశాడు.
LSG vs GT Toss Update: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో రెండు మార్పులు చేశాడు. సాయి సుదర్శన్ స్థానంలో మాథ్యూ వేడ్ వస్తున్నాడు. ప్రదీప్ సంగ్వాన్ బదులు యశ్ దయాల్ చోటు దక్కించుకున్నాడు. తాము వరుసగా ఐదు మ్యాచులు గెలిచామని అలాంటప్పుడు ఓడిపోవడానికీ అవకాశం ఉంటుందని వెల్లడించాడు. మరోవైపు తాము టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేద్దామని అనుకున్నట్టు కేఎల్ రాహుల్ చెప్పాడు. రవి బిష్ణోయ్ స్థానంలో కరన్ శర్మను తీసుకున్నామని వెల్లడించాడు.
#GujaratTitans have won the toss and they will bat first against #LSG.
— IndianPremierLeague (@IPL) May 10, 2022
Live - https://t.co/45TbqyBfE3 #LSGvGT #TATAIPL pic.twitter.com/pQB53PfPD3
LSG vs GT Playing XI
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, అవేశ్ ఖాన్, మొహిసన్ ఖాన్, దుష్మంత చమీరా, కరన్ శర్మ
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిషోర్, మహ్మద్ షమి, ప్రదీప్ సంగ్వాన్
LSG సూపర్ ఫామ్
లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఫామ్‌లో ఉంది. మొహిసిన్ ఖాన్ రాకతో వారి పేస్ అటాక్ మరింత బలపడింది. తొలిసారి తలపడ్డప్పుడు గుజరాత్ టైటాన్స్ వీరిపై విజయం అందుకుంది. అందుకే ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని రాహుల్ సేన పట్టుదలతో ఉంది. ఓపెనింగ్‌లో కేఎల్ రాహుల్, డికాక్ సూపర్‌గా ఆడుతున్నారు. దీపక్ హుడా ఎప్పుడూ లేనంత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. మార్కస్ స్టాయినిస్ కూల్‌గా సిక్సర్లు బాదేస్తున్నాడు. మిడిలార్డర్‌లో ఇంకాస్త మెరుపులు అవసరం. చమీరా, అవేశ్ ఖాన్, మొహిసిన్, హోల్డర్‌తో పేస్ విభాగం బలంగా ఉంది. అవసరమైతే స్టాయినిస్ ఉన్నాడు. కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్ స్పిన్‌తో వికెట్లు తీస్తున్నారు. ఓపెనర్లు మహ్మద్ షమి బౌలింగ్‌లో ఆచితూచి ఆడటం అవసరం.
GTకి మూమెంటమ్ కావాలి
మొదట్లో వరుస విజయాలతో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ తాజాగా హ్యాట్రిక్ ఓటములతో ఇబ్బంది పడుతోంది. వృద్ధిమాన్ సాహా దూకుడుగా కనిపిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య ఫామ్‌లోకి రావాలి. మూడో నంబర్‌లో స్థిరమైన ఆటగాడు దొరకడం లేదు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ మిడిలార్డర్‌లో గుజరాత్‌కు ప్రాణంగా మారారు. వీరిని ఇబ్బంది పెడితే టైటాన్స్ పని పట్టినట్టే! ముంబయి ఇదే చేసింది. బౌలింగ్‌లో మాత్రం టైటాన్స్‌కు తిరుగులేదు. వికెట్లు తీస్తున్నా లాకీ ఫెర్గూసన్ ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. షమి, అల్జారీ జోసెఫ్ ఫర్వాలేదు. రషీద్ ఖాన్‌కు మరో స్పిన్నర్ సహకారం అవసరం.
A look at the Playing XI for #LSGvGT
— IndianPremierLeague (@IPL) May 10, 2022
Live - https://t.co/45TbqyBfE3 #LSGvGT #TATAIPL https://t.co/ETLLHId4iS pic.twitter.com/PhVD0HJxfw