(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023: ఐపీఎల్ మినీ వేలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎక్కడ చూడవచ్చు?
ఐపీఎల్ 2023 వేలం రేపు కొచ్చిలో జరగనుంది. దీన్ని ఎక్కడ చూడవచ్చంటే?
IPL Mini Auction: ఐపీఎల్ 2023 (ఐపీఎల్ వేలం) కోసం జరగనున్న వేలంలో 10 ఫ్రాంచైజీ జట్ల వేలం పర్స్‌లో మొత్తం రూ.206.5 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంతో ఈ జట్లకు మొత్తం 87 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ 87 ఖాళీ స్లాట్‌ల కోసం, 991 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. అందులో 405 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు.
ఐపీఎల్ 2023 కోసం చిన్న వేలం ఎక్కడ జరుగుతుంది?
ఈసారి వేలాన్ని కేరళలోని కొచ్చి నగరంలో నిర్వహించనున్నారు.
వేలం ఎప్పుడు, ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
ఐపీఎల్ వేలం డిసెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.
వేలం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందా?
అవును, వేలం ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్‌లలో టెలికాస్ట్ అవుతుంది.
IPL 2023 వేలం ముఖ్యాంశాలు
వేలానికి ఎంపికైన 405 మంది ఆటగాళ్లలో 273 మంది భారతీయులు, 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 119 మంది ఆటగాళ్లకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. మిగిలిన 282 మంది ఆటగాళ్లు అన్‌క్యాప్డ్ కేటగిరీలో ఉన్నారు. 19 మంది ఆటగాళ్ల బేస్ ధర అత్యధికంగా రూ.రెండు కోట్లుగా ఉంది. కానీ ఈ విభాగంలో ఒక్క భారత ఆటగాడు కూడా లేడు.
వీరిలో 11 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.1.5 కోట్లు కాగా, 20 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.కోటిగా ఉంది. వేలం పర్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధిక మొత్తం (రూ.42.25 కోట్లు) ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ పర్స్‌లో తక్కువ డబ్బు (7.05 కోట్లు) కలిగి ఉంది.
View this post on Instagram
View this post on Instagram