IPL 2025 Will Abandoned : ఐపీఎల్ రద్దు..! బీసీసీఐ అత్యవసర సమావేశం..!! ఆ కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటుందా...?
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ పై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ రద్దు కాగా, ఇప్పుడు ఏకంగా టోర్నీనే రద్దు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

BCCI Emergency Meeting: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. టోర్నీని రద్దు చేసి, విదేశీ ఆటగాళ్లను ఆయా దేశాలకు పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఐపీఎల్ లీగ్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను అర్దాంతరంగా రద్దు చేశారు. అలాగే ఈనెల 11 న ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను ముంబైకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత జటిలంగా మారడంతో ఏకంగా టోర్నీనే తాత్కాలికంగా రద్దు చేసే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఇక పాకిస్థాన్ లో కూడా పీఎస్ఎల్ లో నేడు జరగాల్సిన మ్యాచ్ పోస్ట్ పోన్ అయింది. టోర్నీలోని అన్ని మ్యాచ్ లను కరాచీకి షిఫ్ట్ చేశారు.




















