Viral Video: ధోనీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న వైభవ్ సూర్యవంశీ, మూమెంట్ ఆఫ్ ద డే
Vaibhav Suryavanshi touching the feet of MS Dhoni | రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ కాళ్లకు సమస్కరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

IPL 2025 CSK vs RR | రాజస్థాన్ రాయల్స్ టీం ఎట్టకేలకు ఛేజింగ్ చేసి మ్యాచ్ గెలిచింది. పలు మ్యాచ్‌లు చివరివరకూ తీసుకొచ్చి చేతులు ఎత్తేసిన రాజస్తాన్.. చెన్నై సూపర్ కింగ్స్ మీద సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. రాజస్థాన్ మరో 17 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాలెంటెడ్ కిడ్, రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తో అర్థశతకం చేయడంతో పాటు మ్యాచ్‌లో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.
ఇటీవల మెరుపు శతకం చేసి తన ఆటతో క్రికెట్ ప్రేమికుల మనసు గెలిచాడు వైభవ్ సూర్యవంశీ. అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొని ఆ రీతిలో కొత్త బ్యాటర్ విరుచుకుపడటం గొప్పే. అయితే తాజాగా చెన్నైపై రాజస్థాన్ మ్యాచ్ నెగ్గడంలో హాఫ్ సెంచరీతో కీలకపాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ అనంతరం చేసిన చర్యతో ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. దాంతో మూమెంట్ ఆఫ్ ద డే అంటూ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Vaibhav touching the feet of Thala - Moment of the day! 🔥❤️🙏
— Amit T (@amittalwalkar) May 20, 2025
pic.twitter.com/5BvfVwMuhn
పతిరన బౌలింగ్‌లో సిక్స్ కొట్టి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్ ముగించాడు ధృవ్ జురెల్. అనంతరం రాజస్థాన్, చెన్నై ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనకు ఎదురురాగానే కాళ్లకు నమస్కరించాడు రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. అప్పుడు ధోనీ సైతం వైభవ్‌కు ఏదో చెప్పాడు. ధోనీ ఏం చెబుతున్నాడో గమనిస్తూ షేక్ హ్యాండ్ ను కొనసాగించాడు యువ సంచలనం.
మా మనసులు గెలిచావ్ అంటూ వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ సైతం పోస్ట్ చేసింది.
You won our hearts, Vaibhav! 💛✨#CSKvRR #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2025
pic.twitter.com/9q20qfKtAn
వైభవ్ కన్నా రెట్టింపు ఏజ్‌లో ధోనీ
వాస్తవానికి వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. అతడు యువకుడు కూడా కాదు. బాలుడిగా ఉండగానే తన బ్యాటింగ్ స్కిల్స్ తో రాజస్థాన్ జట్టులోకి వచ్చాడు. దిగ్గజ ఆటగాళ్లకే సాధ్యంకాని రీతిలో ఇటీవల శతకం చేశాడు. చెన్నైతో మ్యాచ్‌లో స్టన్నింగ్ ఫిఫ్టీతో రాణించాడు. మరోవైపు ఎంఎస్ ధోనీ వయసు 44 ఏళ్లు. తనకంటే రెట్టింపు వయసు (30 ఏళ్ల ఏజ్ గ్యాప్) ఉన్న, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కాళ్లకు మొక్కి వైభవ్ ఆశీదర్వాదం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఆటతోనే కాదు, గ్రేట్ క్రికెటర్లు, సీనియర్లతో పద్ధతిగా నడుచుకుంటూ క్రికెట్ ప్రేమికుల ప్రశంసల అందుకుంటున్నాడు. ఈ వయసులోనూ కీపింగ్ లో మెరుపు స్టంపింగ్స్ తో ధోనీ ఆకట్టుకుంటున్నాడు. సిక్సర్లును సైతం బాదేస్తూ యంగ్ క్రికెటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. కాగా, సీఎస్కే యంగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే (20 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి రాణించాడు.





















