IPL 2025 PBKS VS RR Result Update: పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. రాజస్థాన్ పై 10 రన్స్ తోె గెలుపు.. ఆకట్టుకున్న వధేరా.. జైస్వాల్- సూర్యవంశీ జోడీ పోరాటం వృథా
అంచనాలకు తగినట్లుగా పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఈ హైస్కోరింగ్ మ్యాచ్ లో పరుగుల వర్షం కురిసింది. జైస్వాల్-సూర్యవంశీ జోడీ ఫియర్లెస్ గా ఆడింది.

IPL 2025 PBKS 8th Victory: ఈ సీజన్ లో 8వ విక్టరీ సాధించిన పంజాబ్ కింగ్స్.. ప్లే ఆఫ్ బెర్త్ కు మరింత చేరువైంది. ఆదివారం జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులతో నెగ్గి, పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్ కు ఎగబాకింది. ఓవరాల్ గా రాజస్థాన్ రాయల్స్ పై ఉత్కంఠ భరిత విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. నేహాల్ వధేరా సూపర్ ఫిఫ్టీ (37 బంతుల్లో 70, 5 ఫోర్లు, 5 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తుషార్ దేశ్ పాండే కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ స్టన్నింగ్ ఫిఫ్టీ ( 31 బంతుల్లో 53, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ హర్ ప్రీత్ బ్రార్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
🚀✨ Wadhera and Shashank's magic on fire! 🎉 PBKS blasts 219 against RR in Jaipur, defying all odds with their explosive batting! 🏆 Nehal Wadhera smashed a career-best 70* off just 37 balls, while Shashank Singh took command of the finisher's role with a thrilling half-century!… pic.twitter.com/ZrydbgswCy
— Cricap (@Cricap2024) May 18, 2025
సూపర్ బాగస్వామ్యం..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు శుభారంభం దక్కలేదు. పవర్ ప్లేలోనే ఫామ్ లో ఉన్న ప్రభ్ సిమ్రాన్ సింగ్ (21), మైకేల్ ఓవెన్ డకౌట్, ప్రియాంశ్ ఆర్య (9) త్వరగా ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) తో కలిసి వధేరా సూపర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ వికెట్లు పడినా, మంచి రన్ రేట్ తో పరుగులు సాధించి, ఇన్నింగ్స్ ను పునర్నిర్మించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 67 పరుగులు జత చేయడంతో పంజాబ్ మంచి స్థితిలోకి వచ్చింది. ఆ తర్వాత శ్రేయస్ ఔటైనా.. వధేరా జోరు కనబర్చాడు. 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేసి, ఆ తర్వాత వేగంగానూ ఆడాడు. చివర్లో శశాంక్ సింగ్ అజేయ ఫిఫ్టీ (30 బంతుల్లో 59 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)తోపాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ ( 21 నాటౌట్) బ్యాట్ ఝళిపించడంతో పంజాబ్ 215+ పరుగులు సాధించింది.
A fighting fifty from Dhruv Jurel 👊
— IndianPremierLeague (@IPL) May 18, 2025
Will he guide #RR home with 22 needed from 6 deliveries? 🤔
Updates ▶ https://t.co/HTpvGew6ef #TATAIPL | #RRvPBKS pic.twitter.com/jUByB1m8sl
ఫెంటాస్టిక్ ఓపెనర్లు..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ ( 25 బంతుల్లో 50, 9 ఫోర్లు, 1 సిక్సర్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ భాగస్వామ్యాన్ని అందించారు. ఓవర్ కు 15 పరుగుల రన్ రేట్ తో పరుగులు సాధించారు. వీరిద్దరూ బౌండరీలతోనే డీల్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. కేవలం 4.5 ఓవర్లలోనే 76 పరుగులు సాధించారు. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో సూర్యవంశీ ఔటయ్యాడు. 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన జైస్వాల్.. తర్వాత బంతికే తను ఔటయ్యాడు. చాలాకాలం విరామం తర్వాత ఆడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్ (20) విఫలమయ్యాడు. మరో ఎండ్ లో రియాన్ పరాగ్ (13) విఫలమైనా, జురెల్ జోరు సాగించాడు. తను కీలకదశలో బౌండరీలు సాధించాడు. షిమ్రాన్ హిట్ మెయర్ (11) మరోసారి విఫలమయ్యాడు. అయితే తన హిట్టింగ్ తో మ్యాచ్ ను దగ్గరి వరకు తీసుకొచ్చిన జురెల్ చివరి దశలో ఔటవడంతో రాజస్థాన్ కు పరాజయం తప్పలేదు. బౌలర్లలో ఓమర్జాయ్, మార్కో యన్సెన్ కు రెండేసి వికెట్లు దక్కాయి.




















