అన్వేషించండి
Advertisement
IPL 2024 RR vs DC: సమ ఉజ్జీల పోరులో జోరు ఎవరిదో! రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ గత రికార్డులు ఇలా
RR vs DC IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ సమరానికి సిద్ధమైంది. ఐపీఎల్ తొమ్మిదో మ్యాచ్‌లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.
Rajasthan Royals vs Delhi Capitals head to head records : ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో రాజస్థాన్ రాయల్స్(RR) సమరానికి సిద్ధమైంది. ఐపీఎల్ తొమ్మిదో మ్యాచ్‌లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ ఐపీఎల్‌ను ఇరు జట్లు భిన్నంగా ఆరంభించాయి. రాజస్థాన్ తొలి మ్యాచ్‌లో లక్నోపై 20 పరుగుల తేడాతో గెలుపొందగా... ఢిల్లీ.. పంజాబ్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు జోరును కొనసాగించాలని భావిస్తుండగా, ఢిల్లీ మొదటి విజయం సాధించాలని పట్టులగా ఉంది.
సమఉజ్జీలుగా..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఇరు జట్లు 27సార్లు తలపడ్డాయి. ఇందులో 13సార్లు ఢిల్లీ విజయం సాధించగా... 14 సార్లు రాజస్థాన్ గెలిచింది. రాజస్థాన్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 పరుగులుకాగా... ఢిల్లీపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 222 పరుగులు. ఢిల్లీ అత్యల్ప స్కోరు 60 పరుగులు కాగా.... రాజస్థాన్ అత్యల్ప స్కోరు 115. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇరు జట్లు ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రాజస్థాన్ నాలుగు మ్యాచ్‌లు గెలవగా, ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. రాజస్థాన్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది.
పిచ్ రిపోర్ట్
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పిచ్ బ్యాటర్‌లకు అనుకూలంగా ఉండవచ్చు. ఈ వేదికపై గత 10 టీ20 మ్యాచ్‌ల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 147 పరుగులు. ఇక్కడ ఒక ఇన్నింగ్స్‌లో కోల్పోయిన వికెట్లు ఆరు.
జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సిన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ , షిమ్రాన్ హెట్మేయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ మరియు తనుష్ కోటియన్.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా మరియు షాయ్ హోప్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement